For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rashi Khanna: అయ్యో పాపం.. రాశీ ఖన్నా ఇన్ని హిట్ సినిమాలను రెజెక్ట్ చేసిందా? అవి గానీ చేసుంటే!

  |

  టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా అందం, అభినయంతో తనదైన పద్ధతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగు, తమిళం కాకుండానే హిందీ చిత్రాల్లోనూ మెరుస్తోంది ఈ భామ. ఇటీవల తెలుగులో థ్యాంక్యూ సినిమాతో పలకరించిన ఈ బ్యూటి కోలీవుడ్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంతో ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తెరంగేట్రం చేసిన రుద్ర అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేసింది గ్లామర్ బ్యూటి రాశీ ఖన్నా. తెలుగులోకి మనం చిత్రంతో ఎంటరైన ఈ భామ తన కెరీర్ లో అనేక సినిమాలను మిస్ చేసుకోవడంతోపాటు రెజెక్ట్ చేసింది. ఆ సినిమాలు ఏంటనే విషయంపై ఓ లుక్కేస్తే!

   మొదటగా హిందీలో..

  మొదటగా హిందీలో..

  ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశీ కన్నా చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. ఇక మోడల్ గా గుర్తింపు అందుకున్న తర్వాత నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది.

  మనం సినిమాతో తెరంగేట్రం..

  మనం సినిమాతో తెరంగేట్రం..

  మద్రాస్ కేఫ్ సినిమాలో రాశీ ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వచ్చాయి. రాశి ఖన్నా తెలుగులో మొదటగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో వెంట వెంటనే అనకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.

  మహేశ్ బాబుకు జోడిగా..

  మహేశ్ బాబుకు జోడిగా..


  అయితే రాశీ ఖన్నా తన కెరీర్ పరంగా కొన్ని సినిమాలను మిస్ చేసుకోవడం, రెజెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని హిట్ కాగా మరికొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హిట్ మూవీ సర్కారు వారి పాట చిత్రంలో ముందుగా రాశీ ఖన్నాను అనుకున్నారట. కానీ ప్రొడ్యూసర్స్ కీర్తి సురేష్ ను సజ్జెస్ట్ చేయడంతో ఆ అవకాశం రాశీ ఖన్నాకు తప్పింది. ఈ సినిమా టాక్ పరంగా ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

   డేట్స్ కుదరకపోవడంతో..

  డేట్స్ కుదరకపోవడంతో..

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా లవ్ స్టోరీ మూవీ గీత గోవిందం చిత్రానికి కూడా రాశీ ఖన్నా పేరు పరిశీలనలోకి వచ్చిందట. దాదాపుగా రాశీ ఖన్నానే ఓకే అనుకున్నారట. అయితే అప్పుడు రాశీ ఖన్నాకు డేట్స్ కుదరకపోవడంతో ఆమెకు బదులు రష్మిక మందన్నాను తీసుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.

  పాత్ర నచ్చక వదిలేసుకున్న భామ..

  పాత్ర నచ్చక వదిలేసుకున్న భామ..

  ఫ్యామిలీ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ హిట్ చిత్రం F2. ఇందులో తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు. అయితే వరుణ్ తేజ్ కు జోడీగా ముందుగా రాశీ ఖన్నా అనుకున్నారు. కానీ అందులో తన పాత్ర నచ్చకపోవడంతో ఆ ఆఫర్ ను రెజెక్ట్ చేసింది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. దీంతో ఆ ఛాన్స్ మెహ్రీన్ ఫిర్జాదాను వరించింది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ కొట్టిన రాక్షసుడు సినిమాలో హీరోయిన్ గా రాశీ ఖన్నా పేరు పరిశీలించిన పలు కారణాలతో ఆమె తప్పుకుంది. చివరిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.

  మజిలీలో పాత్రకు నో చెప్పడంతో..

  మజిలీలో పాత్రకు నో చెప్పడంతో..

  అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం మజిలీ. ఇందులో రెండో హీరోయిన్ గా రాశీ ఖన్నాను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆ పాత్రకు రాశీ ఖన్నా నో చెప్పడంతో.. రెండో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ కు ఛాన్స్ వచ్చింది. కోలీవుడ్ హీరో శింబు ఇటీవల హిట్ కొట్టిన చిత్రం మానాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రాశీ ఖన్నాను అనుకున్నా అనికోని కారణాల వల్ల ఆ ఆఫర్ కల్యాణి ప్రియదర్శినికి వెళ్లింది.

   మరోసారి మెహ్రీన్ కు..

  మరోసారి మెహ్రీన్ కు..

  నాని టక్ జగదీష్ చిత్రంలో రీతూ వర్మ పాత్ర నచ్చక వదిలేసుకుంది రాశీ ఖన్నా. అలాగే జయం రవి భూమి సినిమాకు కూడా నో చెప్పడంతో ఆ ఆఫర్ నిధి అగర్వాల్ ను వరించింది. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా వచ్చిన మహా సముద్రం సినిమాలో ఒక హీరోయిన్ గా రాశీ ఖన్నాను అనుకున్నారు. కానీ ఆ పాత్రను కూడా రెజెక్ట్ చేసింది ఈ బొద్దుగుమ్మ. అలాగే మారుతి దర్శకత్వంలోని మహానుభావుడు సినిమాకు హీరోయిన్ గా రాశీ ఖన్నాను అనుకున్నా అది కుదర్లేదు. దీంతో మరోసారి రాశీ ఖన్నా ఆఫర్ మెహ్రీన్ కు వెళ్లింది. ఇందులో దాదాపుగా హిట్ సినిమాలానే రాశీ ఖన్నా వదిలేసుకుంది. ఒకవేళ ఆ సినిమాల్లో రాశీ ఖన్నా నటించి ఉంటే.. ఆమెకు మరింత క్రేజ్ పెరిగేదేమో.

  English summary
  Tollywood Heroine Rashi Khanna Rejected And Missed The Hit Movies From Geetha Govindam To Sarkaru Vaari Paata.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X