ఒకే ఒక్కసారి ప్లీజ్.. ప్రభాస్‌పై మనసుపడ్డ రష్మిక మందన్న

Rashmika Mandanna: సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందానా (Rashmika Mandanna). సౌత్‌ నుంచి నార్త్ వరకూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తన కొత్త చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్‌' (The Girlfriend) తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అలు అరవింద్ సమర్పణలో, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో రష్మిక సరసన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా రష్మిక హీరో ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ నేషనల్ క్రష్ ఏమన్నారంటే?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందానా ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. తాజాగా 'ది గర్ల్‌ఫ్రెండ్‌' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ప్రేమలోని సంక్లిష్టత, భావోద్వేగాలను అద్భుతంగా చూపించడం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రష్మిక నటన, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్‌పై ఇప్పటికే సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 'ది గర్ల్‌ఫ్రెండ్‌' రష్మిక కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Rashmika Mandanna Expresses Her Wish to Work with Prabhas in The Girlfriend promotions

తాజాగా రష్మిక సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సమయంలో నేషనల్ క్రష్ ఇచ్చిన ఓ ఆసక్తికరమైన సమాధానం చర్చనీయాంశంగా మారింది. ఒక నెటిజన్ "మీరు ప్రభాస్‌తో ఎప్పుడు నటిస్తారు?" అని అడగగా, ఆమె స్పందిస్తూ "నాకు కూడా ప్రభాస్‌తో నటించాలని ఉంది. ఆయన అద్భుతమైన నటుడు. ఆయనతో పని చేసే అవకాశం వస్తే నా కెరీర్ మరో లెవెల్‌లోకి వెళ్తుంది. ఈ కామెంట్‌ ప్రభాస్‌ చూస్తారనే ఆశిస్తున్నా" అని చెప్పింది.

ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం రేపింది. "మన హీరో రేంజ్ ఇది!" అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ 'ది రాజాసాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

'ఛలో' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక, తక్కువ కాలంలోనే స్టార్ హిరోయిన్‌గా ఎదిగింది. 'గీత గోవిందం', 'భీష్మ', 'సరిలేరు నీకెవ్వరు', 'పుష్ప', 'పుష్ప 2',యానిమల్, ఛావా వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో టాప్ రేంజ్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకుంది. ఇక రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'ది గర్ల్‌ఫ్రెండ్‌'మూవీ ఆమె కెరీర్ మైల్ స్టోన్ గా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నారని సమాచారం. దీంతో నిశ్చితార్థం తర్వాత తొలిసారి విజయ్‌, రష్మిక ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నారని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా నవంబర్‌ 7న విడుదల కానున్న 'ది గర్ల్‌ఫ్రెండ్‌' రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, ప్రేక్షకులకు ఎమోషనల్ లవ్ జర్నీగా మారబోతోందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X