బాలీవుడ్‌లో రష్మిక మందన్న డెడ్లీ ఎంట్రీ.. మెగాస్టార్‌తో కలిసి గ్రాండ్‌గా..

దక్షిణాదిలో సత్తా చాటుతున్న రష్మిక మందన్న బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఒక ఆఫర్‌ను చేజిక్కించుకొన్న ఈ కన్నడ భామ మరో బిగ్ ఆఫర్‌ను అందుకొన్నట్టు సమాచారం. ఈ క్రమంలో రష్మిక మందన్న బాలీవుడ్ కెరీర్ గురించి...

 కన్నడ నుంచి టాలీవుడ్‌లోకి

కన్నడ నుంచి టాలీవుడ్‌లోకి

కన్నడ నుంచి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న వరుస విజయాలను అందుకోవడమే కాకుండా అగ్ర హీరోలకు లక్కీ మస్కట్‌గా మారారు. పలు స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలను చేస్తూనే హిందీలోకి అడుగుపెట్టారు.

 డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌ గురించి

డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌ గురించి

డియర్ కామ్రెడ్ చిత్రం తర్వాత బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌లో నటించమని ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే లాక్‌డౌన్ తర్వాత రష్మిక చూపు బాలీవుడ్‌లో పడింది.

మిషన్ మజ్నులో రష్మిక హీరోయిన్‌గా

మిషన్ మజ్నులో రష్మిక హీరోయిన్‌గా

ప్రస్తుతం బాలీవుడ్ హీరో 'సిద్ధార్థ్ మల్హోత్రాతో జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత రోని స్కూృవాలా నేతృత్వంలో గల్టీ, ఆర్ఎస్‌వీపీ బ్యానర్లపై రూపొందుతున్న మిషన్ మజ్ను చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బగ్చీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మిషన్ మజ్ను చిత్రం ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులో 1970లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్నది. సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా నటిస్తున్నారు.

 అమితాబ్ బచ్చన్‌తో డెడ్లీ చిత్రంలో

అమితాబ్ బచ్చన్‌తో డెడ్లీ చిత్రంలో

ఇదే ఊపులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. డెడ్లీ అనే టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లే చిత్రంలో లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. త్వరలోనే రష్మిక రెండో హిందీ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడనున్నది.

Recommended Video

Rashmika Steps In Bollywood | Sidharth Malhotra సరసన Mission Majnu
2021‌లో రష్మిక మందన్న కెరీర్‌

2021‌లో రష్మిక మందన్న కెరీర్‌

హిందీలో రెండు ప్రాజెక్టులతోపాటు ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంలోను, అలాగే తమిళంలో కార్తీ నటించిన సుల్తాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కన్నడలో రూపొందిన పొగరు చిత్రంలో కూడా హీరోయిన్ నటిస్తున్నారు. ఇలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కన్నడ భామ హిందీలోకి కూడా అడుగుపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X