Rashmika Mandanna: అలిసిపోతున్నా.. నా టైం దగ్గర పడింది.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఆమె నటించిన ఏ సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ కావాల్సిందే. పుష్ప సిరీస్, యానిమల్, చావా, కుబేర సినిమాలతో రష్మిక ఎదురు లేకుండా దూసుకెళ్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆమెతో పోటీ వచ్చే హీరోయిన్ దరిదాపుల్లో కూడా లేరు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మిక మందన్న తాజాగా పెట్టి పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్
కిర్రాక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో తొలుత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఛలో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, పుష్ప సినిమాలతో తిరుగులేని నటిగా నిలిచారు రష్మిక. తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. గుడ్‌బాయ్ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

సైమా అవార్డ్స్‌లో సందడి
ఆ తర్వాత మిషన్ మంజు, యానిమల్, చావా, సికందర్, సినిమాలలో నటించిన రష్మిక ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా నేషనల్ క్రష్‌గా బాలీవుడ్‌లో గట్టిగా జెండా పాతింది. ప్రస్తుతం తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్, హిందీలో థామా సినిమాలలో నటిస్తున్నారు రష్మిక. ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025లో రష్మిక సందడి చేశారు. పుష్ప ది రూల్ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
విజయ్ దేవరకొండతో రిలేషన్?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమాయణం సాగిస్తున్నారని ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ జంట సీక్రెట్‌గా హోటల్స్, రెస్టారెంట్స్‌లలో ప్రత్యక్షం కావడంతో పాటు ఫారిన్‌లో వెకేషన్‌కు కూడా కలిసి వెళ్తున్నారు. ఇక ఇటీవల విజయ్ నటించిన కింగ్డమ్ మూవీని సీక్రెట్‌గా వీక్షించి మరోసారి లేనిపోని డౌట్స్ పెట్టింది రష్మిక. వీరిద్దరికి సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందంటూ కథనాలు వెల్లువెత్తాయి. సైమా అవార్డుల వేడుక కోసం దుబాయ్‌లో దిగిన రష్మిక వేలికి మూడో ఉంగరం ఉండటం అనేక అనుమానాలు కలిగించింది.
నిద్రపోవాలా? మేల్కోవాలా?
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మిక మందన్న.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటోషూట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. వృత్తి జీవితంలో రష్మిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా ఆ పోస్ట్ చెబుతోంది. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిద్రపోవాలా? మేల్కోవాలో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.
అలిసిపోతున్నా
ఇది జరిగి రెండ్రోజులు కాకముందే ఆ వెంటనే రష్మిక మరో పోస్ట్ పెట్టారు. తన డైరీని ఉద్దేశించి రాసుకొచ్చిన ఆమె.. నువ్వు పరిగెడుతూనే ఉన్నావు, కానీ మనం ఎక్కడికి పరిగెడుతున్నాం, నీ లక్ష్యం ఏమిటీ? స్లో అయ్యే సమయం ఎప్పుడు? నిజంగా దూకుడు తగ్గించడం లాంటిది ఏదైనా ఉందా? ఏం చేయాలి? ఏ పనిచేస్తే ఉత్తమం? ఈ సమాధానాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరిని అడగాలి? అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు రష్మిక. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బిజీ షెడ్యూల్స్‌తో రష్మిక బాగా అలిసిపోయారని.. ఆమె విశ్రాంతిని కోరుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











