For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోల గురించి పోస్ట్ చేస్తానని రష్మిక వీడియో మెసేజ్...వెంటనే డిలీట్, అసలు ఏమైంది?

  |

  'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ భామ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. అయితే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేసి రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  సూపర్ ఫామ్ లో

  సూపర్ ఫామ్ లో

  గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత నితిన్‌తో భీష్మతో హిట్ అందుకుని మంచి ఫాంలో ఉన్న ఈ భామ ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా నటిస్తోంది.

  సినిమాల్లో బిజీ బిజీ

  సినిమాల్లో బిజీ బిజీ

  పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పింది. ఇక ఆమె తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా తర్వాతి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందని అంటున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సూర్యకు 40వ సినిమా. అంతే కాక రష్మిక హిందీలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది.

  వీడియో పోస్ట్ చేసి డిలీట్

  వీడియో పోస్ట్ చేసి డిలీట్

  అయితే తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో మెసేజ్ షేర్ చేసింది.. ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి ఆమె మాట్లాడింది. అయితే ఆ కొద్దిసేపటికే వీడియో డిలీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అసలు ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేసింది ? ఎందుకు డిలీట్ చేసింది ? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పోస్ట్ చేసిన వీడియోలో ఆమె ఏమీ మాట్లాడింది అనే విషయాలు పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

  అందరూ సేఫ్ గా

  అందరూ సేఫ్ గా

  వీడియో మొదలు పెడుతూనే ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో మీరు అందరూ సేఫ్ గా ఉన్నారని భావిస్తున్నానని ఆమె పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని గతంలో ఎన్నడూ ఊహించలేదని అయినా అందరూ గట్టిగా పోరాడుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఈ మహమ్మారి మన రోజువారీ దినచర్య పూర్తిగా మార్చేసిందని ఆమె బాధ పడింది. అంతేకాక గత ఏడాది జరిగిన పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుందని తెలియడానికి నాకు ఎంత సమయం పట్టిందని ఆమె పేర్కొంది.

  ఆర్డినరీ హీరోలు ఎక్స్ట్రార్డినరీగా

  ఆర్డినరీ హీరోలు ఎక్స్ట్రార్డినరీగా

  కానీ తనకు అర్థమైన విషయం ఏమిటంటే ఇలాంటి సమయంలో పాజిటివ్ మైండ్ తో ఎప్పుడూ పాజిటివ్ గా ఉండటం మంచిదని, మనం ఈ యుద్ధాన్ని గెలిచేందుకు దగ్గరగా ఉన్నామని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఈ విషయాన్ని చెబుతూ ఆమె మరో రెండు వారాల పాటు కొంతమంది ఆర్డినరీ హీరోలు ఎక్స్ట్రార్డినరీగా ఎలా జనానికి ఉపయోగపడుతున్నారు అనే అంశాన్ని మీ ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నానని పేర్కొంది. ఇవన్నీ చూసినప్పుడు తనలో ఒక ఆశ రేకెత్తిందని ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది.

  హీరోల గొప్పతనం మీ ముందుకు

  హీరోల గొప్పతనం మీ ముందుకు

  ఇలాంటి సమయంలో మనం ఎక్కడి నుంచి వచ్చాము ? ఎక్కడివారం ? అలాగే ఏ భాష మాట్లాడతాం ఇలాంటి విషయాలన్నీ ఏమీ అక్కర్లేదని ఎవరు ఎక్కడ మంచి పనులు చేస్తున్నా మీ ముందుకు తీసుకువస్తానని ఆమె పేర్కొంది. మీ అందరిలో ఒక స్మైల్ తీసుకురావడానికి మీకు ఒక చిన్న ఆశ కల్పించడానికి ఈ హీరోల గొప్పతనం మీ ముందుకు తీసుకు వస్తానని ఆమె పేర్కొంది. అయితే విడుదల చేసిన కాసేపటికే ఈ వీడియోని తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
  అందుకేనా

  అందుకేనా

  అయితే ఇప్పటికే టాలీవుడ్ హీరోల గురించి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. హీరోలు కోట్లు సంపాదిస్తూ ప్రజలకు సేవ చేయడం లేదని పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. చిరంజీవి మొదలు ఇతర హీరోలు దర్శకులు తమకు చేతనైనంత సాయం చేస్తూనే ఉన్నా వాళ్ళు మాత్రం సరిగా సాయం చేయడం లేదని హీరోలను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రష్మిక ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తే అది మరింత రచ్చకి దారి తీసే అవకాశం ఉండటంతో ఆమె దాన్ని తొలగించి ఉండవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Rashmika Mandanna shared a video of her sending a message on surviving, and she stated that she want to highlight a few stories of our ordinary heroes doing extraordinary stuff. however, within a few minutes, she deleted the post.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X