ఆ హీరో అండర్ వేర్ చూస్తూ రష్మిక మందన్న అలా.. దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్
కన్నడ సినిమా పరిశ్రమలో కిరిక్ పార్టీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్న అనతికాలంలోనే దక్షిణాదిలో అగ్రతారగా మారిపోయింది. కన్నడలో అంజనీ పుత్ర, చమక్ చిత్రంలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఛలో, గీతా గోవిందం, దేవదాస్ లాంటి హిట్లతో తెలుగు సినిమా పరిశ్రమలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు (కన్నడ), సుల్తాన్ (తమిళం) మంచి గుర్తింపును తెచ్చాయి. అయితే తనకు లభించిన క్రేజ్‌ను దక్షిణాదికే పరిమితం చేయలేదు. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీపై తన దృష్టిని గురిపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలతో బిజీగా మారిపోయింది.
అంతేకాకుండా తనకు ఉన్న పాపులారిటిని క్యాష్ చేసుకోవడానికి వ్యాపార ప్రకటనల్లోను నటిస్తున్నది. తాజాగా బాలీవుడ్ నటుడు వికీ కౌశల్‌తో కలిసి మాచో స్పోర్ట్ అండర్ వేర్ యాడ్‌లో నటించింది. అయితే ఆ యాడ్‌లో వికీ కౌశల్ అండర్ వేర్‌ను సంతోషంలో మునిగిపోయే కాన్సెప్ట్‌తో రూపొందిన యాడ్‌లో నటించిన తీరుపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా మహిళా అభిమానులు ఆమె నటించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా రష్మిక మందన్న అముల్ మాచో అడ్వర్టైజింగ్‌లో వికీ కౌశల్‌తో నటించారు. అయినే విలువల, ఇతర అంశాల గురించి మాట్లాడను. కానీ డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం ఇబ్బందిగా అనిపించింది అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
డియర్ రష్మిక.. మీరు నటించిన మాచో స్పోర్ట్ యాడ్‌ను చూశాను. కానీ ఆ ప్రకటనను చూసి డిస్పాపాయింట్ అయ్యాను. ఇలాంటి ప్రకటనల్లో మీరు నటిస్తారని ఊహించలేదు. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే.. మీరు చిన్నగా నవ్వుకొని క్షమించండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇక రష్మిక మందన్న సినీ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో సిద్దార్థ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం త్వరలోనే డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కానున్నది. ఇక తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











