Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలాంటివి నా దగ్గరి నుంచి నేర్చుకోండి.. రష్మిక మందన్న వీడియో వైరల్
రష్మిక మందాన్న సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. తెరపై ఎంత సరదాగా ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి ఫన్నీగా ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. గత వారంలో రష్మిక ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఉపాసనతో కలిసి ఓ ప్రోగ్రాంలో తనపర్సనల్ విషయాలను చెప్పడంతో సోషల్ మీడియా మొత్తం రష్మిక వార్తలే హల్చల్ చేశాయి.

సోషల్ మీడియాలో అలా..
రష్మిక ఈ మధ్య సోషల్ మీడియాలో తన వర్కవుట్లతో రచ్చ చేస్తోంది. సముద్రంలో వర్కవుట్లు చేస్తూ మొదటగా వీడియోలను షేర్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఎక్కడ వర్కవుట్లు చేసినా సరే వీడియోలను పోస్ట్ చేస్తూ నానా హంగామా చేస్తుంటుంది.

ఉపాసనతో కలిసి..
ఉపాసనతో కలిసి రష్మిక మందాన్న చేసిన షోలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. రష్మిక ఫ్యామిలీ, వారి తెగల సంప్రదాయ వంటకం పంది అని, రోజు రాత్రి పడుకునే ముందు రెండు పెగ్గుల వైన్ తాగుతారని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పంది మాంసం తింటానని చెప్పడంతో రష్మికపై ట్రోలింగ్ జరిగింది.

తాజాగా అలా..
రష్మిక తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో వర్కవుట్లు చేస్తూ.. ఓ కామెంట్ చేసింది. మామూలుగా వర్కవుట్లు చేయడానికి అందరికీ మోటివేషన్ కావాలని అంటుంటారు.. కానీ అవన్నీ ఎందుకు.. అవి లేకపోయినా కూడా చేయొచ్చని చెబుతూ.. కావాలనంటే నా దగ్గరి నుంచి నేర్చుకోండంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రష్మిక అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేస్తూ వర్కవుట్ చేసింది.
ఫుల్ బిజీగా..
రష్మిక ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమా కోసం భారీగానే కసరత్తులు చేస్తోంది. ఇక త్వరలోనే రష్మిక కూడా పుష్ప సెట్‌లో బన్నీతో కలిసి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. ఇక ఇప్పటికే కోలీవుడ్ ఎంట్రీ మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. కార్తీ సుల్తాన్ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.