Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియుడితో నయనతార బ్రేకప్ అంటూ వస్తున్న వార్తల వెనుక అసలు రహస్యం ఇదేనట.!
దక్షిణాదిలోని అన్ని భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. గతంలో గ్లామరస్ రోల్స్ మాత్రమే చేసిన ఈమె.. ఈ మధ్య సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీంతో మంచి మంచి విజయాలను అందుకుంటోంది. అదే సమయంలో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటోంది. తాజాగా ఆమె తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిందని జరుగుతున్న ప్రచారం వెనుక అసలు రహస్యం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...

నయనతార కోసం పోటీ పడుతున్నారు
ప్రస్తుతం నయనతార దక్షిణాది ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తెరకెక్కించేందుకు ఆమెను చాలా మంది ఫిల్మ్ మేకర్లు సంప్రదిస్తున్నారట. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. అలాగే, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. దీంతో నయనతార రాబోయే రెండేళ్లలో బిజీగా గడపనుంది.

ఈ రెండు చిత్రాలు మంచి పేరు తెచ్చాయి
నయనతార గత ఏడాది పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి', ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్'లో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ రెండు సినిమాలూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలే కావడం విశేషం.

నయనతార వాటిలో మాత్రం విఫలం
కొన్నేళ్లుగా నయనతార సినీ కెరీర్ విజయవంతంగా సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఆమె లేడీ సూపర్ స్టార్‌గా పేరును కూడా సంపాదించుకుంది. అయితే, ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది. కెరీర్ ఆరంభంలో ఓ ప్రముఖ హీరోతో లవ్ ట్రాక్ నడిపిన నయన్.. ఆ తర్వాత ప్రభుదేవాతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తర్వాత బ్రేకప్ చెప్పేసింది.

నయన్ జీవితంలోకి యంగ్ డైరెక్టర్
నయనతార కొన్నేళ్ల కిందట యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం బయటకు వచ్చిన సమయంలోనే తమ బంధం పెళ్లి వరకు వెళ్తుందని ఆమె గతంలోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల ఈ జంట దేవాలయాలను కూడా సందర్శించిన విషయం తెలిసిందే.

ప్రియుడితో బ్రేకప్.. అసలు రహస్యం ఇదే
కొద్ది రోజులుగా నయనతార.. విఘ్నేష్‌తో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంలో దీని వెనుక అసలు రహస్యం బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న నయన్.. పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేస్తున్నామని చెప్పిందట. దీంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయని అంటున్నారు.