రాత్రికి రాత్రే ప్రెగ్నెంట్‌గా హీరోయిన్ రెజీనా.. షాకింగ్ విషయం బట్టబయలు!
Regina Cassandra: దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కాసండ్రా. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా తన అందం, స్టైల్‌తో అభిమానులను కట్టిపడేస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన ఓ ఆసక్తికరమైన రివిలేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెజీనా చెప్పినట్లుగా ఒకసారి తాను గర్భవతి (pregnant) అని అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏం జరిగింది?
తమిళనాడుకు చెందిన రెజీనా మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2005లో ఒక తమిళ సినిమా ద్వారా వెండితెరకి అడుగుపెట్టింది. తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన సినిమా 'శివ మనసులో శృతి'(2012). సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. తర్వాత ఆమె 'రొటీన్ లవ్ స్టోరీ'తో మరింత ఫేమ్ సంపాదించుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ రెండింట్లోనూ వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇటీవల "విదాముయార్చి" (తమిళం), "జాట్" (హిందీ), "కేసరి చాప్టర్ 2" (హిందీ) వంటి సినిమాలలో నటించి తన నటనతో మెప్పించింది.

ఫుడ్ అంటే ప్రాణం!
ఇటీవల రెజీనా యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసిన ఓ షోలో పాల్గొంది. అక్కడ ఆమె తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడింది. "ఫుడ్ అనేది నా కోసం ఓ అడ్వెంచర్‌లా ఉంటుంది. ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో - నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను" అంటూ చెప్పింది. మంచి ఫుడ్ ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోతానని, ఫుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.
స్వీట్ కోసం చెప్పిన అబద్ధం
అక్కడే రెజీనా ఒక ఫన్నీ, షాకింగ్ అనుభవాన్ని షేర్ చేసింది. బెంగళూరులో ఉన్నప్పుడు ఒక రాత్రి తనకు చాలా ఇష్టమైన "మిష్టి దోయ్" (Bengali Sweet) తినాలని బాగా అనిపించిందట. దానికోసం ఎన్నో స్వీట్ షాపులు తిరిగిందట. కానీ, ఎక్కడా దొరకలేదని చెప్పింది. చివరికి ఒక షాప్‌లో ఆ స్వీట్ కనిపించినా అప్పటికే షాప్ మూసే టైమ్ అయిపోయింది. సేల్స్ బాయ్ "ఇప్పుడే షాప్ క్లోజ్ అయిపోయింది, సర్వ్ చేయలేం" అని చెప్పాడట.
అప్పుడు రెజీనా తన స్వీట్ కోసం తాపత్రయంతో "నేను ప్రెగ్నెంట్... నాకు ఈ స్వీట్ తినాలని చాలా కోరికగా ఉంది" అని అబద్ధం చెప్పేసిందట!.. ఆ మాట విన్న షాప్‌కీపర్ వెంటనే జాలిపడి షాప్ మళ్లీ ఓపెన్ చేసి ఆమెకు ఆ స్వీట్ ఇచ్చాడట. "నిజానికి నేను గర్భవతిని కాదే కానీ, ఆ మిష్టి దోయ్ కోసం అలా చెప్పాల్సి వచ్చింది" అంటూ నవ్వుతూ చెప్పింది.
రెజీనా చెప్పిన ఈ ఫన్నీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్‌జన్లు "స్వీట్ లవ్ కోసం ఇంత దూరం వెళ్లిందంటే నిజంగానే ఫుడ్ లవర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు "ప్రెగ్నెంట్ అబద్ధం చెప్పినా సీన్ మాత్రం క్యూట్‌గా ఉంది" అని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి రెజీనా కాసండ్రా తన ముద్దు స్వీట్ కోసం చెప్పిన ఆ అబద్ధం వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











