సుశాంత్ మరణం వెనుక ఏం జరిగింది? నోరు విప్పనున్న రియా చక్రవర్తి.. ఇంకా ఆ భయం, బాధలోనే!

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ వైపు అల్లాడిపోతుంటే.. హీరోయిన రియా చక్రవర్తి పీకల్లోతూ వివాదాల్లో కూరుకుపోయారు. సుశాంత్ సింగ్ మరణం కేసులో అనూహ్య పరిస్థితు మధ్య జైలు జీవితాన్ని అనుభవించి రావాల్సి రావడం ఓ విషాదంగా మారింది. అయితే 2020 సంవత్సరం రియా చక్రవర్తి అత్యంత దయనీయంగా మారింది. అయితే 2021లో రియా చక్రవర్తికి మంచి రోజులు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తి వ్యక్తిగత, ప్రొఫెషనల్ కెరీర్ గురించి...

సుశాంత్ సింగ్ లవర్‌గా

సుశాంత్ సింగ్ లవర్‌గా

రియా చక్రవర్తి విషయానికి వస్తే.. జూన్ 2020 వరకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసిగా సినీ ప్రపంచానికి పరిచితులు. ఆయితే అనుమానాస్పద పరిస్థితుల్లో సుశాంత్ మరణించగానే పలు ఆరోపణలన్నీ ఆమెపై వచ్చాయి. దాంతో ఆమె జీవితం ఉక్కరిబిక్కిరి అయ్యింది. ఆ తర్వాత అన్ని వేళ్లు ఆమెనే నేరస్థురాలిగా చిత్రకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

సుశాంత్ సింగ్ తండ్రి కేసుతో

సుశాంత్ సింగ్ తండ్రి కేసుతో

సుశాంత్ మరణంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సుశాంత్ తండ్రి పాట్నాలో కేసు నమోదు చేయడంతో రియా చక్రవర్తి మెడకు ఆర్థిక లావాదేవీల ఆరోపణలు చుట్టుకొన్నాయి. ఆ తర్వాత డ్రగ్స్ కేసు మరింత బిగుసుకోవడంతో సంచలన రీతిలో రియా చక్రవర్తి అరెస్ట్ కావడం జరిగింది.

సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరేపణ

సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరేపణ

సుశాంత్ సింగ్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేశారు. ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించారు అనే ప్రధాన ఆరోపణలతో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి దాదాపు నెల రోజులపాటు ముంబైలోని బైకుల్లా జైలులో గడిపారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదల కావడంతో కాస్త ఉపశమనం లభించింది. ప్రస్తుతం బయట ప్రపంచానికి దూరంగా గడుపుతున్నది.

రియా గురించి రూమీ జాఫరీ

రియా గురించి రూమీ జాఫరీ

ఇలాంటి పరిస్థితుల్లో రియా చక్రవర్తి గురించి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు, దర్శకుడు రూమీ జాఫరీ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను రియాను ఇటీవల కలిసి ఆమెతో మాట్లాడాను. ఆమె జైలు జీవితం నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఆ బాధ, భయం ఆమెలో ఇంకా కనిపిస్తున్నాయి అంటూ రూమీ వెల్లడించారు. వచ్చే ఏడాది రియా తన సినిమా కెరీర్‌ను మళ్లీ మొదలుపెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఆమె ఈ కేసుల్లో నోరు విప్పే అవకాశం లేకపోలేదు.. అంటూ చెప్పారు.

Recommended Video

Varun Tej Boxer Movie Launch
సుశాంత్ కేసుపై సీబీఐ

సుశాంత్ కేసుపై సీబీఐ

ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సీబీఐ ఇంకా దర్యాప్తు చేస్తున్నది. అలాగే సుశాంత్ అకౌంట్లలో జరిగిన అవకతవకలపై ఈడీ దృష్టిపెట్టింది. అంతేకాకుండా డ్రగ్స్ కేసును ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్నది. ఇలాంటి కేసులన్నీ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో రియాతో ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలో 2020 ఎలాగూ ఆమె చేదు అనుభావాన్ని మిగిల్చింది. 2021 ఆమె కెరీర్‌కు ఆశలు చిగురిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X