Sai Pallavi: బికినీ ఫోటోలపై సాయిపల్లవి రియాక్ట్.. నిజంగానే వేసుకుందా?

Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులకు సంపాదించుకుంది. వాస్తవానికి సాయి పల్లవి అనగానే ప్రధానంగా పాత్రల ఎంపిక, అద్భుతమైన డ్యాన్సులు గుర్తొస్తాయి. ఇలా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బికినీ వేసుకుందని చెప్పి కొన్ని ఫొటోలని తెగ వైరల్ చేశారు. వారం పదిరోజులుగా ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి నిజమేనని కొందరు, లేదంటే ఏఐ ఫొటోలని వారికొందరూ. ఈ నేపథ్యంలో సాయి పల్లవినే ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

సాయి పల్లవి తమిళంలో "ప్రేమమ్" సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగు సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన "ఫిదా"తో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన నటన, అందంతో ప్రేక్షకులను ఫిదా చేసుకుంది. ఆ తర్వాత పలు భిన్నమైన పాత్రల్లో నటిస్తూ, కథ, వ్యక్తిగత ఇమేజ్ ఉన్న హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అవకాశాలు భారీగా వస్తున్నా, ఆమె ఎక్కువగా సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటుంది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎన్నుకుంది. ఆ పాత్రకు తన నటనతో జీవం పోసింది. ఆమె ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటుంది. డ్యాన్సర్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కాబట్టి, తన నటనతో పాటు డ్యాన్స్ స్కిల్స్ ద్వారా కూడా ఫాలోయింగ్ పెంచుకుంది.

Sai Pallavi Clarifies Viral Bikini Rumors with Original Photos

తాజాగా సాయి పల్లవి "అమరన్", "తండేల్" సినిమాలతో సూపర్ హిట్స్ అందించడంతో, సోషల్ మీడియాలో ఆమెకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సినిమాకు కమిట్ అయ్యే సమయంలో ఆమెకు కథ నచ్చకపోతే, అది హిట్ అయ్యినా, ఏ సినిమా అయినా రిజెక్ట్ చేస్తుంది. ఈ సొంత ప్రిన్సిపిల్స్ వలన, చాలా స్టార్ హీరోల సినిమాలను కూడా ఆమె రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న "రామాయణం" చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఈ విధంగా, ఆమె న్యాచురల్ బ్యూటీ, నటన, సరైన పాత్రల ఎంపిక ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాయిపల్లవి అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యూటీ డ్రెస్సింగ్ వార్తకు పరిష్కారం లభించింది. ఇటీవల సాయి పల్లవి తన సోదరి పూజతో కలిసి వేకేషన్‌ను వెళ్లింది. ఈ క్రమంలోనే బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది. ఈ టూర్ కు సంబంధించిన కొన్నిఫోటోలను సాయి పల్లవి చెల్లి పూజ తన ఇన్ స్ట్రామ్ వేదికగా పంచుకుంది. మరుక్షణంలో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. కొంతమంది వ్యక్తులు ఆ ఫోటోలని మోర్ఫ్ చేసి, సాయి పల్లవి బికినీ ధరించినట్లు చూపించే ప్రయత్నం చేశారు.

ఈ ఎడిటింగ్ ఫోటోలు వైరల్ కావడంతో సాయి పల్లవి తనదైన స్టైల్ లో స్పందించింది. ఆ ట్రిప్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'పైన కనిపిస్తున్నవన్నీ నిజంగా తీసిన ఫొటోలు, ఏఐ ఫొటోలు కాదు' అని క్యాప్షన్ పెట్టింది. దీంతో వైరల్ బికినీ ఫొటోలన్నీ అబద్ధం అని చెప్పకనే చెప్పింది. మరి ఇప్పటికైనా ఆమె ఫ్యాన్స్ నమ్ముతారా లేదంటే నిజంగానే బికినీ వేసుకుందని అనుకుంటారో మరి? సాయి పల్లవి కామెంట్ తో ట్రోలింగ్ కు చెక్ పడుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: sai pallavi movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X