For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాశ్మీర్ ఫైల్స్ కీ 'జై శ్రీ రామ్' అనే వాళ్ళకు తేడా ఏముంది.. సాయి పల్లవి వివాదాస్పద కామెంట్స్

  |

  విరాటపర్వం సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు విడిపోయి కొంతమంది ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తుంటే కొంత మంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. కాశ్మీరీ పండిట్ల హత్యలు ప్రస్తావిస్తూ ఆమె గో రక్షక్ ల దుడుకుతనం మీద ఆమె కామెంట్స్ చేయడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆ వివరాల్లోకి వెళితే

   విరాటపర్వం సినిమాతో

  విరాటపర్వం సినిమాతో


  ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ, తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చూస్తూ వెళుతున్నా సరే ఆమె ఎంతో మంది దర్శకులకు ఫస్ట్ ఆప్షన్ గా మిగిలిపోతుంది. తనదైన అందంతో, అభినయంతో, డాన్స్ తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్న సాయి పల్లవి మరి కొద్ది రోజుల్లో విరాటపర్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

   విరాటపర్వం అనే సినిమాతో

  విరాటపర్వం అనే సినిమాతో

  రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో, సురేష్ బాబు సమర్పిస్తోండగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది.

  నక్సలిజం టెర్రరిజంకి మధ్య తేడా

  నక్సలిజం టెర్రరిజంకి మధ్య తేడా

  అందులో భాగంగానే సాయిపల్లవి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె కాశ్మీర్ పండిట్ల మారణహోమాన్ని, గో హత్యలకు పాల్పడేవారిని గో రక్షకులుగా చెప్పుకునే వారు కట్టేసి కొడుతూ కొన్ని చోట్ల చంపుతున్న వైనాన్ని లింక్ చేస్తూ అవి ఒకటేనని అర్థం వచ్చేలా మాట్లాడింది. విరాట పర్వం సినిమా నక్సలిజం నేపథ్యంలో ఉంటున్న కారణంగా, నక్సలిజం టెర్రరిజంకి మధ్య తేడా ఏమిటి అనే విషయం మీదకు చర్చ మళ్ళింది.

   తేడా ఎక్కడ ఉంది?

  తేడా ఎక్కడ ఉంది?

  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా వచ్చింది కదా ఆ సినిమాలో వాళ్ళు చూపించారు, ఎలా చంపారు, అనే విషయాలను చూపించారు. మనం వాటిని ఒక మత సంఘర్షణలాగానే చూస్తే ఇప్పుడు రీసెంట్ గా బండిలో కౌ(ఆవు)లు తీసుకు వెళుతున్నారు. బండిలో డ్రైవర్ ముస్లింగా ఉన్నాడు అని కొంతమంది కట్టేసి జైశ్రీరామ్ జైశ్రీరామ్ అని అనమంటున్నారు. అలా అయితే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది? మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా ఉంటే ఇతరులను ఇబ్బంది పెట్టము, లెఫ్టిస్ట్, రైటిస్ట్ కాదు, మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు అని ఆమె చెప్పుకొచ్చింది. .

  సినిమా బ్యాన్ అంటూ

  సినిమా బ్యాన్ అంటూ

  అయితే ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయం మీద సాయిపల్లవి వ్యవహారంలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొంతమంది సాయి పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని ప్రశ్నిస్తుంటే మరికొందరు మాత్రం సాయి పల్లవికి చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకుని మాట్లాడమని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే సాయి పల్లవి దుర్మార్గమైన వ్యాఖ్యల నేపథ్యంలో మేము విరాటపర్వం సినిమాని చూడడం లేదు అని మా తరపునుంచి మేము సినిమాను బాన్ చేసుకుంటున్నాము అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్లనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  English summary
  actress Sai Pallavi Makes Controversial Comments About Kashmir Files And Jai Shree Ram Comments in her recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X