హాట్ హాట్‌గా సమంత అక్కినేని.. సెక్సీగా, స్టన్నింగ్‌గా.. ఇంతకు ముందెన్నడు లేని విధంగా రెచ్చిపోయిన బ్యూటీ!

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన సీజన్ 1లో మనోజ్ బాజ్‌పేయ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారితే.. రెండో సీజన్‌లో సమంత అక్కినేని ఫెర్ఫార్మెన్స్ హాట్ టాపిక్‌గా మారింది. ది ఫ్యామిలీ మ్యాన్‌లో సమంత అక్కినేని చేసిన మ్యాజిక్ ఏమిటో తెలుసుకొందాం...

తమిళ టెర్రిరిస్టు రాజీగా

తమిళ టెర్రిరిస్టు రాజీగా


ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ పాత్రలో సమంత అక్కినేని నటించింది. ట్రైనింగ్ పొందిన తమిళ ఈలం టెర్రిరిస్టుగా కనిపించింది. సూసైడ్ మిషన్‌లో కీలక సభ్యురాలిగా, యుద్ధ విమానాలను నడిపే కమాండర్‌గా తొలి రెండు మూడు ఎపిసోడ్స్‌లోనే రాజీ పాత్ర ఏంటో కనిపిస్తుంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆమె ఓ వస్త్ర తయారీ సంస్థలో కూలీగా పనిచేస్తుంటుంది.

లైంగిక దాడి, వేధింపులపై ఫైట్

లైంగిక దాడి, వేధింపులపై ఫైట్

వస్త్ర తయారీ కంపెనీలో పనిచేసే సమయంలోను బస్సులో ప్రయాణించాల్సి రావడం, ఆ క్రమంలో ఓ వ్యక్తి నుంచి వేధింపులు ఎదుర్కోనాల్సి రావడాన్ని భరించలేక ఆ వ్యక్తిని షాకింగ్ చంపేసే సీన్‌లో సమంత నటన అద్భుతంగా ఉంటుంది. యాక్షన్ సీన్లలో తన టాలెంట్‌ను మరో కోణంలో చూపించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నదని చెప్పవచ్చు.

అసాధారణమైన పాత్రలో సమంత

అసాధారణమైన పాత్రలో సమంత

ఇక తాను పనిచేసే కంపెనీలో యజమాని తనపై లైంగిక దాడి చేసే సీన్‌లో సమంత అక్కినేని విశ్వరూపం ప్రదర్శించింది. బలవంతంగా కోరిక తీర్చుకొనే యజమానికి లొంగిపోవడం ఇష్టంలేని రాజీ పాత్ర ఎదురు తిరగడం సీజన్ 2లోని ప్రధానమైన సన్నివేశాల్లో ఒకటిగా అనిపిస్తుంది. అంతటి ప్రభావవంతమైన పాత్రను సమంత అసాధారణంగా, సహజంగా, సులభంగా పండించింది.

పోలీస్ స్టేషన్ దాడి ఎపిసోడ్‌లో

పోలీస్ స్టేషన్ దాడి ఎపిసోడ్‌లో


ఇక తమిళనాడు పోలీసులు, ఎన్ఐఏ అధికారులు వెంటాడే సీన్‌ సమంత ప్రతిభకు మరో పరాకాష్ట. పోలీసులను, అధికారులను వెంటాడి వేటాడే టెర్రిరిస్టుగా ఆమె నటన పీక్స్. యాక్షన్ సీన్లలో ఆమె వ్యవహరించిన తీరు, చురకుదనం ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఇక పోలీస్ స్టేషన్‌పై దాడి సన్నివేశాల్లో సమంత యాక్టింగ్ టాప్ అనిచెప్పవచ్చు.

Recommended Video

The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
డీ గ్లామర్ పాత్రలో కూడా అదుర్స్

డీ గ్లామర్ పాత్రలో కూడా అదుర్స్

సమంత పాత్రకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ గానీ, లుక్ విషయంలో రాజ్ అండ్ డీకే టీమ్ తీసుకొన్న జాగ్రత్తలు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. మనోజ్ బాజ్‌పేయ్ పెర్ఫార్మెన్స్‌ను పక్కన పెడితే.. సమంత ఈ షో ద్వారా ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో సఫలమైందని చెప్పవచ్చు. డీ గ్లామర్ పాత్రలోను, లైంగిక వేధింపుల సంబంధించి గానీ సమంత స్టన్నింగ్, ఫిట్‌గా కనిపించి మైమరిపించిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X