For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  samantha స్టార్ హీరోలను తలదన్నేలా.. టాలీవుడ్‌లో మరెవరికీ సాధ్యపడని విధంగా!

  |

  సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను, ఇష్టాలను తమ ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి సోషల్ మీడియాను విరివిగా పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మీడియా ముందుకు రాకుండా తమకు అనిపించింది అనిపించినట్టు ఫాలోవర్స్‌తో పంచుకుంటూ.. వారి అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో అందరికంటే ముందుంటుంది హీరోయిన్ సమంత. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో అందరి కంటే ముందు స్థానంలో నిలబడింది. ఆ వివరాల్లోకి వెళితే

  అరుదైన ఘనత

  అరుదైన ఘనత

  ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత అరుదైన ఘనత సాధించింది. సమంత 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను అధిగమించింది. ఒక రకంగా సౌత్‌లోని హీరోయిన్లలో అత్యధిక ఫాలోయింగ్‌ కలిగిన నటిగా ఆమె అవతరించింది. అయితే ఇంతకు ముందే కాజల్ కూడా ఆ మార్క్ దాటింది. అంతే కాదు టాలీవుడ్ మేల్ స్టార్స్‌ తో పోలిస్తే కూడా ఆమెకే అత్యధిక ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ దాదాపు 14 మిలియన్ల మంది ఫాలోవర్లతో మేల్ కేటగిరిలో అత్యధిక ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.

  ఇన్‌స్టాగ్రామ్‌ను విస్తృతంగా

  ఇన్‌స్టాగ్రామ్‌ను విస్తృతంగా

  నిజానికి సమంతకు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్లు ఉన్నా ఆమె ఎందుకో కానీ ఇన్‌స్టాగ్రామ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తుంది. ఆమె ఇప్పటికే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో ఇన్‌స్టాలో తన ఫాలోయింగ్‌ను మానిటైజ్ చేస్తోంది. ఇక ఈ కొత్త మైలురాయి ఆమెకు మరింత సహాయం చేస్తుందని చెప్పొచ్చు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంతకు ఇది మరో రేర్ ఫీట్.

  సెకండ్ ఇన్నింగ్స్‌లో

  సెకండ్ ఇన్నింగ్స్‌లో

  ఇదిలా ఉంటే, సమంత సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదటి అసైన్‌మెంట్ అంటే పుష్పలోని ఐటెమ్ నంబర్ షూటింగ్ ప్రారంభించింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలోనే ఈ సాంగ్ సెట్స్ నుండి సమంత బ్యాక్ పోజ్ పిక్ ఒకదానిని చిత్ర బృందం విడుదల చేసింది. 'సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్' అని క్యాప్షన్ ఇచ్చారు.

  కాజల్ కూడా

  కాజల్ కూడా

  నిజానికి తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును కాజల్ వివాహమాడిన తరువాత ఆమెకు 20 మిలియన్ ఫాలోవర్స్ రాగా సమంత కూడా విడాకుల ప్రకటన చేసిన కొన్నాళ్ళకు ఈ ఫీట్ సాధించింది. ఇక ప్రస్తుతం కాజల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర వరకు షూటింగ్ ను పూర్తి చేసింది కాజల్. ప్రస్తుతం కాజల్ గర్భవతి అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే ఆమె సినిమాలను తగ్గించిందని అంటున్నారు.

  Recommended Video

  Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Filmibeat Telugu
  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  సమంత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె రెండు ద్వి భాషా చిత్రాల్లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో ఒక‌టి త‌మిళ నిర్మాణ‌ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌లో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌, ఎస్‌.ఆర్‌.ప్ర‌భుల‌తో క‌లిసి శాంత రూబన్ జ్ఞాన‌శేఖ‌ర‌న్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నారు. మ‌రో చిత్రాన్ని హ‌రి, హరీష్ అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొంద‌నున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ చిత్రంలో స‌మంత ఓ స్పెష‌ల్ కూడా చేస్తున్నారు.

  English summary
  Samantha bags 20 million followers on Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X