For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మ చెప్పిందంటూ సమంత మరో షాకింగ్ పోస్ట్.. కృతజ్ఞతగా ఉండు.. ఫైట్ చేయమంటూ!

  |

  నాగచైతన్య తో ప్రేమ, ఆ తరువాత పెళ్లి దాకా వెళ్ళిన సమంత ఈ మధ్యనే తాము ఇద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి విడాకుల ప్రకటన తర్వాత కూడా ఎక్కువగా సమంత చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. విడాకుల వ్యవహారం తర్వాత సమంత చాలా బాధపడుతుంది అనే విషయాన్ని ఈ పోస్టుల ద్వారా వెల్లడిస్తోంది.. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  పెద్దలను ఒప్పించి

  పెద్దలను ఒప్పించి

  ఏం మాయ చేశావే సినిమాతో అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. అప్పటికప్పుడు ప్రేమలో పడ లేదు కానీ తర్వాత ఇద్దరూ కలిసి ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.. వీరి ప్రేమ మొదలు వివాహం దాకా ప్రతి విషయం కూడా చర్చనీయాంశమైంది. అయితే అనూహ్యంగా అక్కినేని సమంత అని ఉండే సోషల్ మీడియా అకౌంట్ లో అక్కినేని పేరు తొలగించి సమంత ఎస్ అనే పేరు పెట్టుకోవడంతో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారు అని ప్రచారం జరిగింది..

   ఇద్దరం విడి పోతున్నామని

  ఇద్దరం విడి పోతున్నామని

  ఆ విడాకులు ప్రచారం జరిగినట్లుగానే అక్టోబర్ 2వ తేదీన తాము ఇద్దరం విడి పోతున్నామని సమంత నాగచైతన్య ఒకే సమయంలో అధికారికంగా ప్రకటించారు. వీరు నుంచి విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత వీరు విడాకులకు కారణం సమంతే అని చాలామంది ప్రచారం చేస్తూ వచ్చారు దానికి రకరకాల కారణాలు చెబుతూ సమంత కొంతమందితో అఫైర్లు పెట్టుకుందని కొందరు అంటే లేదు ఆమెకు పిల్లలను కనడం ఇష్టం లేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటూ వచ్చారు..

  కూకట్పల్లి కోర్టులో

  కూకట్పల్లి కోర్టులో

  ఈ విషయం మీద ముందు కొంత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించిన సమంత అయినా ఈ విశ్లేషణలు ఆగకపోవడంతో కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ విషయం మీద ఇప్పుడు వాదనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో సమంత మరోపక్క తన స్నేహితురాళ్ళతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లి ఆధ్యాత్మిక భావన పెంపొందించుకునే ప్రయత్నం చేస్తోంది.

  మై మమ్మా సెడ్‌ అంటూ

  మై మమ్మా సెడ్‌ అంటూ

  అయితే విడాకులు తీసుకోవడానికి ముందు నుంచీ సమంత 'మై మమ్మా సెడ్‌(మా అమ్మ చెప్పింది)' అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొన్ని పోస్టులు చేస్తూ వస్తోంది. అవి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా రోజుల తర్వాత సామ్‌.. మరోసారి 'మై మమ్మా సెడ్‌ అంటూ మరో ఆసక్తికర పోస్ట్‌ చేసింది.

  Recommended Video

  #BiggBossTelugu5 : Vj Sunny సూపర్ పవర్ | Shannu ని దాటేస్తాడేమో || Filmibeat Telugu
  కృతజ్ఞతతో ఉండండి

  కృతజ్ఞతతో ఉండండి

  'ఇప్పుడు మీరిలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి, అలాగే రేపు ఏం కావాలని కోరుకుంటున్నారో అందుకోసం నిరంతరం పోరాడుతూ ఉండండి' అని చెప్పుకొచ్చింది. ఇక విడాకుల తర్వాత సామ్‌ రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వీటికి సంబంధించిన షూటింగ్స్‌లోనూ పాల్గొననుంది. ఈ లోపు ఉన్న ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా వరుసగా ట్రిప్స్ కు వెళుతోంది. సమంత శాకుంతలం సినిమా షూట్ పూర్తి కాగా మరో తమిళ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఆ సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

  English summary
  Samantha again posted 'my mom said' message in instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X