For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చైతూ కోసం బాలీవుడ్ బంపర్ ఆఫర్ వదులుకున్న సమంత.. అది ఒప్పుకుని ఉంటేనా?

  |

  అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులు ప్రకటన వచ్చి దాదాపు 15 రోజులు గడుస్తున్నా వారి విడాకులకు సంబంధించిన వార్తలు మాత్రం ఇప్పటికే ఆగడం లేదు. వారి విడాకులకు సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో మీడియాలో దర్శనమిస్తూనే ఉంది. అయితే నాగచైతన్య కోసం సమంత ఒక బాలీవుడ్ బంపర్ ఆఫర్ కూడా వదులుకున్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  ప్రేమ కలిగి

  ప్రేమ కలిగి

  అక్కినేని నాగచైతన్య, సమంత ఏం మాయ చేసావే షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. అప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ పుట్ట లేదు కానీ చాలా కాలం తర్వాత స్నేహితులుగా ఉన్న తర్వాత వారిద్దరికీ ప్రేమ కలిగింది.. దీంతో ఇంట్లో పెద్దలను ఒప్పించి వారు అరేంజ్డ్ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో వీరిద్దరి జంట కనువిందు చేస్తూ ఉండేది. చాలా మంది భార్యాభర్తలు అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా వారిద్దరూ ఉండేవారు.

  బాగానే ఉన్నా

  బాగానే ఉన్నా

  అక్కినేని నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కు వెళ్ళే సమయంలో కూడా వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆయన షూటింగ్ కి వెళ్లిన సమయంలో సమంతా ఆనందం వ్యక్తం చేస్తూ అప్పట్లో ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ తర్వాత అనూహ్యంగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో అక్కినేని అనే పదం తొలగించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. అయి తారా స్థాయికి చేరడంతో మీడియాలో కూడా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కథనాలు వచ్చాయి.

  అనూహ్యంగా

  అనూహ్యంగా

  చాలా కాలం పాటు వీరు ఈ విషయం మీద స్పందించకపోవడంతో ఇది నిజం కాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా వారి నాలుగు వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజులకు ముందు తాము అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇక మీద భార్యా భర్తలుగా కలిసి ఉండలేమని స్నేహితులుగా కొనసాగుతామని అధికారికంగా ప్రకటించారు. విడాకులు ప్రకటన వచ్చిన తర్వాత కూడా రకరకాల కథనాలు వారి విడాకుల గురించి వస్తూనే ఉన్నాయి.

  అఫైర్లు కూడా అంటగట్టడంతో

  అఫైర్లు కూడా అంటగట్టడంతో

  విడాకులకు నాగచైతన్య కారణమని చాలా తక్కువ మంది వాదిస్తుంటే సమంత విడాకులకు కారణం ఎక్కువ శాతం మంది ఆమెను టార్గెట్ చేశారు. ఆమెకు వేరే వాళ్ళతో అఫైర్లు కూడా అంటగట్టడంతో భరించలేక ఆమె నాకు ఎలాంటి అఫైర్లు లేవు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ సంగతి అంతా పక్కన పెడితే ఆమె నాగ చైతన్య కోసం ఒక బంపర్ ఆఫర్ ని వదులుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సమంత స్నేహితులు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సమంత పిల్లల్ని కనడం కోసం సినిమాలు చేయడం ఆపేయాలని అనుకుంటుంది అని వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

  వారి నుంచి ఆఫర్

  వారి నుంచి ఆఫర్

  అలా అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ నుంచి ఒక బంపర్ ఆఫర్ సమంతకు వచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మొదటి హీరోయిన్ గా నటించమని కోరగా తాను ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నానని నటించలేనని ఆమె చెప్పిందట. ఆమె నటించలేనని చెప్పడంతోనే నిర్మాతలు నయనతార ను సంప్రదించడంతో ఆ సినిమాకు ఆమె ఒప్పుకుందని తెలుస్తోంది.

  బంపర్ ఆఫర్ వదులుకుని

  బంపర్ ఆఫర్ వదులుకుని


  అలా నాగచైతన్య కారణంగా సమంత ఆ బాలీవుడ్ బంపర్ ఆఫర్ వదులుకున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉందో తెలియదు కానీ విడాకులు ప్రకటన తర్వాత దసరా రోజున ఈ రెండు సినిమాలను ఆమె అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆమె తెలుగులో శాకుంతలము అనే సినిమాలో నటించగా తమిళంలో కూడా నయనతార బాయ్ ఫ్రెండ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రలో నటించడం విశేషం.

  English summary
  as per reports Samantha Lost Shah Rukh Khan’s movie with Atlee Due To Chaitanya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X