రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి వేడుకలు... బాయ్‌ఫ్రెండ్‌తో అలాంటి ఫోజులు

శోభిత ధూళిపాళ్లని అక్కినేని నాగాచైతన్య రెండో వివాహం చేసుకోవడంతో సమంత వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. చైతూ మాదిరిగానే తను కూడా ఒంటరి జీవితానికి స్వస్తి పలికి మరో తోడు వెతుక్కుంటారా? అంటూ రకరకాల కథనాలు వైరల్ వయ్యాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారని, ఓ దర్శకుడితో క్లోజ్‌గా ఉంటున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. కొద్దికాలానికే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉండటంతో గత కొద్దినెలలుగా వీరి రిలేషన్‌పై రకరకాల వార్తలు వస్తున్నాయి.

రాజ్ నిడిమోరుతో క్లోజ్‌గా సమంత
చైతూతో విడాకుల తర్వాత ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లతో అదరగొట్టారు సమంత రూత్ ప్రభు. వీటికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ సమయంలోనే సమంతకు రాజ్ నిడిమోరుకు మధ్య స్నేహం ప్రేమగా మారి ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్‌కి ఆల్రెడీ వివాహం జరగ్గా భార్యకు విడాకులిచ్చి త్వరలోనే సామ్ మెడలో మూడు ముళ్లు వేస్తారని లెక్కలెనన్ని గాసిప్స్ వచ్చాయి. రాజ్ భార్య కూడా దీనికి తగినట్లుగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Samantha Ruth Prabhu And Rumoured Boyfriend Raj Nidimoru s Diwali Celebrations

జంటగా చక్కర్లు
ఇక సమంతకు అన్నీ అవసరాల్లో అండగా నిలుస్తున్నారు రాజ్ నిడిమోరు. ట్రాలలా పేరుతో సమంత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి శుభమ్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా పనులను రాజ్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ సందర్భంగా ఫ్లైట్‌లో వెళ్తుండగా రాజ్ భుజంపై సమంత వాలిపోయి కనిపించే ఫోటో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య యవ్వారం తారాస్థాయికి చేరిందని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత సామ్ - రాజ్ కలిసి పికిల్ బాల్ ఆడటం.. కలిసి అమెరికా సహా ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటూ చర్చ జరిగింది.

తిరుమలలో ప్రత్యేక పూజలు
ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీకాళహస్తి ఆలయాలను రాజ్‌తో కలిసి సమంత దర్శించుకోవడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. తమ వైవాహిక జీవితం సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే వీరిద్దరూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం సినిమాతో పాటు రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇటీవల సమంత కొత్తింటిలో గృహ ప్రవేశం చేశారు. లగ్జరీగా ఉన్న ఈ ఇంటిలో సకల సదుపాయాలు ఉన్నాయి.

రాజ్‌తో కలిసి దీపావళి వేడుకలు
ఇదిలాఉండగా.. రాజ్‌తో క్లోజ్‌గా ఉంటున్నప్పటికీ ఆయనతో తన బంధాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని మీడియాకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నారు. తాజాగా దీపావళి పర్వదినం మరోసారి వీరిద్దరినీ ఒకేచోటికి చేర్చింది. ముంబైలో జరిగిన దివాళీ వేడుకల్లో సమంత- రాజ్ నిడిమోరు కలిసి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో రాజ్‌తో సమంత చాలా క్లోజ్‌గా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సమంత - రాజ్‌లు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? తమ మధ్య ఉన్న బంధాన్ని ఎప్పుడు బయటపెడతారు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X