For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha : నియంతలు, హంతకుల గెలుపు అంటూ సంచలనం.. నమస్కారం పెట్టేసిన నాగ్!

  |

  ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఈ రోజు సాయంత్రం నాగచైతన్య, సమంత ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. అయితే విడాకులు ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే కాగా ఈ రోజు ఉదయాన్నే సమంత తన ఇంస్టాగ్రామ్ స్టేటస్లో పెట్టిన ఒక మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. తన తల్లి చెప్పింది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసిన సమంతా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీసింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎట్టకేలకు క్లారిటీ

  ఎట్టకేలకు క్లారిటీ

  టాలీవుడ్ కపుల్ నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వ్యవహారం మీద ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట. ముందుగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో అక్కినేని అనే పదం తొలగించడంతో నాగచైతన్య సమంత విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఇన్ని రోజులు సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చిన ఈ జంట ఈరోజు తమ విడాకులు తీసుకుంటున్నట్టు గా ప్రకటించారు.

  విడిపోతున్నాం అని అధికారికంగా

  విడిపోతున్నాం అని అధికారికంగా

  పదేళ్ల తమ స్నేహ బంధం కొనసాగుతుందని అయితే భార్యాభర్తలుగా మాత్రం తాము విడిపోతున్నాం అని ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ ఈ ఉదయాన్నే సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అయితే అది ఈ విడాకులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలేనా లేక మరేదైనా దీని వెనుక ఉందా అనే దాని మీద క్లారిటీ లేదు కానీ విడాకులు ప్రకటన రావడంతో ఇప్పుడు దీనిని కూడా ఈ విడాకుల విషయానికి లింకు పెట్టి చూస్తున్నారు జనం.

  నియంతలు హంతకులు అంటూ

  నియంతలు హంతకులు అంటూ

  స‌మంత ఇన్‌స్టాగ్రాం స్టోరీలో ''నేను విచారంలో ఉన్న‌ప్పుడు మా అమ్మ చెప్పిన మాట‌లే గుర్తొస్తాయి. చ‌రిత్ర‌లో గెలిచింది ప్రేమ, నిజాయితీలే. నియంత‌లు, హంత‌కుల గెలుపులు తాత్కాలిక‌మే, చివరికి వారు నేల‌కొర‌గ‌క త‌ప్ప‌దు. ఇది ఎన్న‌టికీ గుర్తుపెట్టుకోవాలి అంటూ స‌మంత‌ పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఆమె ఉద్దేశం ఏమిటి అనే దాని మీద ఇప్పటికీ సరైన క్లారిటీ అయితే రాలేదు.

  నమస్కారం


  బరువెక్కిన హృదయంతో నేను ఈ విషయం చెబుతున్నాను అంటూ నాగార్జున కూడా ఈ విషయం మీద స్పందించారు. చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ పెట్టి సమంత అలాగే నాగచైతన్య మధ్య జరిగిన విషయం చాలా దురదృష్టకరమని, ఇది సాధారణంగా భార్యభర్తల మధ్య జరిగే చాలా వ్యక్తిగతమైన విషయం అని అన్నారు. సమంతతో పాటు నాగచైతన్య కూడా నాకు చాలా ఇష్టమని, నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆనదిస్తింది. అలాగే ఆమె ఎల్లప్పుడూ మాకు ప్రియమైనది అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేవుడు వారిద్దరికీ బలాన్ని ప్రసాదించాలని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియా మొత్తం మీద ఇదే విషయం ట్రెండ్ అవుతుంది.

  English summary
  as we all know Akkineni Naga Chaitanya and Samantha announced their divorce. now Samantha Instagram story has became viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X