Samantha: ఆ హీరో కంటే నాగ్ మామే అందగాడు.. తేల్చేసిన సమంత
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంతను ఆ ఫ్యామిలీలో మెంబర్‌గానే చూస్తున్నారు అక్కినేని అభిమానులు. ఆ కుటుంబం గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సమంత గురించి కూడా చర్చించుకుంటున్నారు అభిమానులు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జునను ఉద్దేశించి సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సమంతకు కోడలి పోస్ట్
నాగచైతన్య ఇష్టపడిన తర్వాత సమంతను తన కోడలిగా అంగీకరించి ఇద్దరికీ ఘనంగా గోవాలో పెళ్లి చేసి పెద్ద మనసును చాటుకున్నారు. అక్కినేని ఇంటికి కోడలిగా రావడానికి ముందే సమంతతో నాగ్‌కు అనుబంధం ఉంది. అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన మనంలో సమంతకు కీలకపాత్ర ఇవ్వడంతో పాటు ఆమెను కూతురిగా చూసుకున్నారు నాగార్జున. నాగచైతన్యతో విడాకులు కాకముందు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా సమంత కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం నాగార్జున బిజీగా ఉండటంతో బిగ్‌బాస్ 4లో దసరా రోజున సమంత హోస్ట్‌గా వచ్చి అలరించారు.

విడాకులైనా నాగ్‌పై తగ్గని అభిమానం
వివాహం తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్న సమంత - నాగచైతన్యలు నాలుగేళ్లు తిరిగేసరికి విడాకులు తీసుకోవడంతో అక్కినేని ఫ్యామిలీ.. నాగార్జున బాగా మనస్తాపానికి గురయ్యారు. చైతన్యతో విడాకులు అయిపోయినప్పటికీ తన మాజీ మామగారిపై సమంత అభిమానం చూపిస్తూనే వచ్చారు. నాగార్జున చేసిన సినిమాలకు రివ్యూలు ఇస్తూ ఉండేవారు. నాగార్జున సినిమాలో సమంత మరోసారి కనిపించబోతున్నారని, ఫలానా దర్శకుడు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని వార్తలు వచ్చేవి. కానీ తర్వాత అవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోవడంతో అక్కినేని అభిమానులు బాగా డల్ అయ్యారు.
సమంత- చైతన్యల దారులు వేరు
సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య .. మరో హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో గతేడాది డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అటు సమంత కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌లు తీసిన రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం సాగిస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. సమంత ఎక్కడుంటే రాజ్ అక్కడ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
నాగ్ మామే హ్యాండ్సమ్
కాగా.. ఆగస్ట్ 29న నాగార్జున పుట్టినరోజు కావడంతో తన మామ గారి అందం గురించి సమంత మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫోటోలను పక్కనపెట్టిన యాంకర్ వీరిలో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అని ప్రశ్నించింది. దానికి సమంత.. మన్మథుడు 2లోని డైలాగ్ చెబుతూ నాగ్ మామ మోస్ట్ హ్యాండ్సమ్ అని తేల్చేసింది. ప్రస్తుతం సమంత మాటల తాలుకా వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











