నా డైవోర్స్‌ను వాళ్లు పండుగ చేసుకొన్నారు.. నా లైఫ్‌లో ఆ వ్యక్తి గురించి.. సమంత ఎమోషనల్
వ్యక్తిగతం, ప్రొఫెషనల్‌గా ఎదురైన సమస్యలను అధిగమించుకొంటూ సమంత రుత్ ప్రభు మళ్లీ తన జీవితాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలు, రూమర్లు, గాసిప్స్‌పై గుంభనంగా ఉంటూ ఆమె తనదైన శైలిలో లైఫ్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెషనల్‌గా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత తాజాగా ఎన్టీటీవీ వరల్డ్ సమ్మిట్ (NDTV World Summit) లో అథెంటిసిటీ: న్యూ ఫేమ్ అనే టాపిక్ గురించి ఆమె మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను ఆసక్తికరంగా వెల్లడించారు. సమంత చెప్పిన విషయాల్లోకి వెళితే.
కెమెరా ముందు జవాబుదారీగా ఉండటమనేది కష్టమే. అది ఒకరకమైన ఫైనల్ డెస్టినేషన్. వర్క్ ఇన్ ప్రొగ్రెస్ అనే తరహా లాంటి విధానం. దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నా విషయంలో చాలా విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే భావన నాకు కలిగింది అని సమంత చెప్పారు.

నా జీవితంలో నేను తీసుకొన్న నిర్ణయాలు ఫర్‌ఫెక్ట్ కాదు. ముఖ్యంగా నేను ఫర్‌ఫెక్ట్ అని చెప్పుకోలేను. నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు. అవి నా లైఫ్‌పై తీవ్రమైన ప్రభావం చూపించవచ్చేమో. కానీ అలాంటి సమస్యలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాను. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా నేను సరిచేసుకొంటున్నాను అని సమంత అభిప్రాయాలను వ్యక్తం చేసింది.
నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జర్నీలో నా జవాబుదారీతనం గురించి మాట్లాడుతున్నాను. నా జీవితంలో ఉన్న వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను పూర్తిగా వివరించలేను. వాస్తవాలుగా చెప్పాల్సిన సమయంలో వాటి గురించి మాట్లాడుతాను. నా జీవితాన్ని ఫాలో అయిన వారు, దగ్గర నుంచి చూసిన వారికి నా సమస్యలు అర్ధమవుతాయి అని సమంత అన్నారు.
ఇక నా వైవాహిక జీవితంలో ఏర్పడిన సమస్య, నా విడాకులు, అలాగే నాకు చేసిన తీవ్రమైన జబ్బు, ఆ అనారోగ్యం నుంచి బయటపడిన తీరు విషయంలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో నాపై తీవ్రంగా ట్రోల్ చేశారు. నన్ను చాలా రకాలుగా ట్రోల్ చేశారు. నా డైవోర్స్ విషయాన్ని కొందరు పండుగ చేసుకొన్నారు. నా జీవితం గురించి వారే జడ్జిమెంట్ ఇచ్చేవారు. వారి జడ్జ్‌మెంట్ చాలా బాధాకరంగా ఉండేది అని సమంత తన ఆవేదనను వ్యక్తం చేశారు.
సమంత రుత్ ప్రభు కెరీర్ విషయానికి వస్తే.. నటిగా ఆమె కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే నిర్మాతగా మారి ఆమె రూపొందించిన శుభం సినిమా మంచి హిట్ అయింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. త్వరలోనే భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











