Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: హర్షా భోగ్లే బెస్ట్ టీమిండియా టీ20 ఎలెవన్.. కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Samantha Ruth Prabhu అలా కాలు జారిన సమంత.. విడాకుల రూమర్లకు దూరంగా..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత తన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నది. సింగిల్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూ విహార యాత్రలతో అభిమానులకు జోష్ పుట్టిస్తున్నది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తూ మంచుకొండల్లో హంగామా చేస్తున్నది. పర్వత ప్రాంతాల్లో మంచు క్రీడలో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తున్నది. మంచులో స్కేటింగ్ చేస్తూ ఓ ఆసక్తికరమైన వీడియోతోపాటు ఓ మెసేజ్‌ను పోస్టు చేసింది. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..

నాగార్జున వ్యాఖ్యల దుమారం..
నాగచైతన్యతో విడాకుల వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో కుదిపేసింది. సమంత ముందు విడాకులు కోరుకొన్నది. అందుకే నాగచైతన్య సిద్దపడ్డాడు అని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఓ కథనం వైరల్ అయింది. అయితే ఈ వార్తపై మీడియాలో రకరకాలుగా ప్రచారం కావడంతో నాగార్జున ఘాటుగా స్పందించారు. ఈ వార్తలో నిజం లేదు. రూమర్లను కాదు. వాస్తవాలను వార్తలుగా వేయండి అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఈ గందరగోళం పట్టించుకోకుండా సమంత స్విట్జర్లాండ్‌లో హంగామా చేస్తున్నది.

పుష్ప సక్సెస్ తర్వాత
పుష్ప చిత్రంలో ఊ అంటావా ఊ ఊ అంటావా? పాటతో మంచి సక్సెస్ అందుకొన్న సమంత ఆ విజయాన్ని స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నది. యశోదా సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ బ్యూటీ విహారయాత్రను ప్లాన్ చేసుకొన్నది. తనకు ఇష్టమైన మంచు క్రీడను ఎంజాయ్ చేస్తూ రకరకాల పోస్టులతో ఆలరిస్తున్నది. అయితే ఐస్ స్కేటింగ్‌లో తన గురువు కేట్ మాక్ బ్రైడ్ గురించి ప్రశంసలు గుప్పిస్తున్దని. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని రిసార్టులో లైఫ్‌ను ఫుల్లుగా సంతోషంగా గడుపుతున్నది.

స్విట్జర్లాండ్‌లో మంచు స్కేటింగ్
స్విట్జర్లాండ్‌లో
మంచు
స్కేటింగ్
గురించి
సమంత
చెబుతూ..
నాకు
ఈ
స్పోర్ట్
అంటే
చాలా
ఇష్టం.
కానీ
ఈ
స్పోర్ట్
వెనుక
ప్రమాదం
కూడా
ఉంటుంది.
అందుకే
నేను
చాలా
సార్లు
ఇలాంటి
క్రీడల
జోలికి
వెళ్లకూడదని
అనుకొన్నాను.
కానీ
ఈ
సారి
మాత్రం
కాస్త
ధైర్యం
చేశాను.
సుశిక్షితులైన
ట్రైనర్ల
సహాయంతో
ఈ
క్రీడను
ఆస్వాదిస్తున్నాను
అంటూ
సమంత
పోస్టులు
పెడుతూ
వచ్చింది.

100 సార్లు పడి ఉంటా
అయితే
సాహోసోపేతమైన
మంచు
స్కేటింగ్‌ను
అనుభవం
ఉన్న
వ్యక్తిగా
రయ్
మంటూ
దూసుకెళ్తున్నది.
తన
స్కేటింగ్‌కు
సంబంధించిన
ఫోటోలను,
వీడియోలను
షేర్
చేస్తూ
తన
అనుభవాలను
పంచుకొంటున్నది.
ఇక
మంచులో
స్కేటింగ్
దూసుకెళ్తూ
జారిపడిన
వీడియోను
తన
ఇన్స్‌టాగ్రామ్‌లో
షేర్
చేసింది.
ఇప్పటి
వరకు
100
సార్లు
పడి
ఉంటాను.
చాలాసార్లు
నాకు
నేను
బ్యాలెన్స్
చేసుకొన్నాను.
కానీ
ఇలా
పడటం
ఇదే
మొదటిసారి
అంటూ
ఓ
వీడియోను
పోస్టు
చేసింది.

ట్రైనర్ కేట్ నన్ను రక్షించింది.
మంచు కొండల్లో స్కేటింగ్ నాకు చక్కటి ఆనందాన్ని ఇస్తుంది. ఓ సారి జర్రున జారి పడటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ నా ట్రైనర్ కేట్ నన్ను రక్షించింది. సమయానికి ఆమె అందుబాటులో లేకపోతే నేను గాయాల బారిన పడి ఉండేదాన్నేమో. అందుకు నా కోచ్ కేట్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని సమంత ఓ వీడియోను పోస్టు చేసి ఓ వీడియోను పెట్టింది. ఈ వీడియోకు భారీగా లైక్స్ వచ్చాయి. కొద్ది గంటల్లోనే 5 లక్షలకుపైగా లైక్స్ రావడం గమనార్హం.
సమంత రుత్ ప్రభు సినిమా కెరీర్ ఇలా..
సమంత రుత్ ప్రభు సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో సమంత నటించారు. ఊ అంటావా? ఊఊ అంటావా పాటలో నర్తించిన సమంతకు మంచి రెస్సాన్స్ లభించింది. ఇక యశోదా అనే చిత్రంలోను, అలాగే తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్‌లో నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.