ఫుల్ జోష్‌తో షూటింగ్‌కు సమంత.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పి ఎమోషనల్ ట్వీట్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు అనారోగ్యం నుంచి తేరుకొని మళ్లీ వరుస ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు. గత కొద్ది నెలలుగా మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతూ షూటింగులకు, సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. ఆమె అనారోగ్యం నుంచి తేరుకొని.. ఇటీవల తాను శారీరకంగా, మానసికంగా సిద్దంగా ఉన్నానంటూ ఎక్సర్‌సైజులు చేస్తూ వీడియోను షేర్ చేయడం తెలిసిందే. అయితే గత కొద్ది నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్‌కు హాజరయ్యారు. అయితే సమంత చేయబొయే సినిమాల గురించిన వివరాల్లొకి వెళితే..
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు రుసో బ్రదర్స్ రూపొందించే ఇంటర్నేషన్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు నటిస్తున్నారు. ఇండియన్ వెర్షన్‌లో ఈ సిరీస్‌కు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే) తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌కు సమంత రుత్ ప్రభు హాజరవ్వడంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని.. మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఫ్యాన్స్ ఆకాక్షిస్తున్నారు. ఈ సిరీస్‌ను ఉత్తర భారతదేశంతోపాటు, సెర్బియా, సౌతాఫ్రికాలో షూట్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా, సమంత ట్వీట్ చేస్తూ.. త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్‌కు హాజరవుతాను. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు అంటూ శివ నిర్వాణ, మైత్రీ మూవీస్‌ను ట్యాగ్ చేసింది.
అయితే సమంత రుత్ ప్రభు ట్వీట్‌కు విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చేంత వరకు మేము వేచి చూస్తాం. మీరు షూటింగులో అడుగుపెట్టినప్పుడు మీ ముఖం మీద చిరునవ్వు ఉండాలి అని విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చారు.


Click it and Unblock the Notifications











