Samantha Ruth Prabhu ఇగో ఇంటివద్దనే పొట్టుకో.. నాపై ఆలాంటి ఆంక్షలు.. సమంత పోస్ట్ వైరల్
అక్కినేని వారసుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నది. తన జీవితానికి తగిలిన భారీ షాక్ నుంచి త్వరగానే కోలుకొని తన లైఫ్‌ను, ప్రొఫెషనల్ జీవితాన్ని చక్కబెట్టుకొంటున్నది. తాజాగా స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న సమంత చేసిన కామెంట్లు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత చేసిన కామెంట్టు, ఏమిటనే విషయంలోకి వెళితే..

వైవాహిక జీవితం అర్ధాంతరంగా
తన వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిన నేపథ్యంలో తొలినాళ్లలో ఆధ్యాత్మిక చింతనకు గురైందా అనే ఆలోచనను కలిగించింది. హరిద్వార్, రుషికేష్ లాంటి ప్రాంతాల్లో పర్యటించిన సమంత మెడిటేషన్ లాంటి వాటిని ప్రాక్టిస్ చేస్తూ తనను తాను బ్యాలెన్స్ చేసుకొనే పనిలో పడింది.

స్నేహితులతో విహారయాత్రలు చేస్తూ..
ఇక విడాకుల ఉదంత తర్వాత తన స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లింది. కేరళ, గోవా, ఇతర ప్రాంతాల్లో పర్యటించిన సమంత లైఫ్‌లో జోష్‌ను ఒడిసిపట్టుకొన్నది. ఆ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌పై దృష్టిపెట్టిన ఈ బ్యూటీ యశోద చిత్రాన్ని పట్టాలెక్కించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో పలు ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

పుష్ప చిత్రంలో ఐటెమ్ సాంగ్‌తో
ఇక విడాకుల తీసుకొని క్రాస్ రోడ్‌లో నిలిచిన సమంత తన కెరీర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకొన్నది. పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో ఊ అంటావా? ఊఊ అంటావా అనే పాటలో స్టెప్పులేసి దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలను తనవైపు తిప్పుకొన్నది. దాంతో బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు ఈ ముద్దుగమ్మను పలుకరిస్తున్పాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

స్విట్టర్జాండ్‌లో సమంత
ఇక ఇలాంటి వార్తల మధ్య సమంత స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ తన మనసుకు నచ్చిన ప్రాంతాలను, అడ్వెంచరస్ స్పోర్ట్స్‌తో జాలీగా సమయాన్ని గడుపుతున్నది. స్విట్టర్లాండ్‌లో అనుభవిస్తున్న మధుర క్షణాలను తన అభిమానులతో పంచుకొంటున్నారు. ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాలుగో రోజు మ్యాజిక్ అంటూ
స్విట్జర్లాండ్‌లో విహార యాత్ర చేస్తున్న సమంత ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతూ.. నాలుగో రోజు మ్యాజిక్ జరిగిపోయింది. మంచులో స్కైయింగ్ చేస్తున్నాను అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. నీ ఇగోను ఇంటి వద్దే వదిలేయమని వాళ్లు చెప్పారు. నిజాలు మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టారు అంటూ సమంత నర్మగర్బమైన కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసిందనే విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











