Samantha చచ్చిపోతానని అనుకొన్నా.. జీవితం కుప్పకూలింది నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత షాకింగ్ వ్యాఖ్యలు
దక్షిణాది సూపర్ స్టార్ సమంత అక్కినేని మరోసారి తన వ్యక్తిగత జీవితం, దాంపత్య జీవిత వైఫల్యం గురించి పెదవి విప్పి షాకింగ్ కామెంట్లు చేసింది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చెప్పిన విషయాలు నేషనల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. జాతీయ మీడియాకు సమంత చెప్పిన విషయాలు ఏమిటంటే..

నాగచైతన్యతో ప్రేమ వివాహం
సమంత, నాగచైతన్య వివాహం గోవాలో ప్రైవేట్ కార్యక్రమంగా అక్టోబర్ 7, 2017 తేదీన జరిగింది. దాదాపు మూడేళ్లపాటు సమంత, నాగచైతన్య అన్యోన్యయంగా గడిపారు. లాక్‌డౌన్ సమయంలో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించారు. ప్రెగ్నెన్సీ కోసం కెరీర్‌ను కూడా పక్కన పెట్టేందుకు సమంత ప్రయత్నిస్తున్నారనే విషయాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

అక్టోబర్ 2వ తేదీన సమంత విడాకులు
అయితే ఎవరూ ఊహించని విధంగా సెప్టెంబర్ 2021 నుంచి మీడియాలో సమంత మ్యారేజ్ లైఫ్‌లో సంక్షోభం గురించి వార్తలు వెల్లువెత్తాయి. అయితే వాటిలో వాస్తవం లేదంటూ కొందరు కొట్టిపడేశారు. అయితే అక్టోబర్ 2వ తేదీ, 2021 రోజున అధికారికంగా విడిపోతున్నట్టు నాగచైతన్య, సమంత తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించడం అభిమానులను, సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది.

డైవోర్స్ తర్వాత అధ్యాత్మిక పర్యటన
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఎమోషనల్‌గా సోషల్ మీడియాలో స్పందించారు. అంతేకాకుండా అధ్యాత్మిక పర్యటనలు చేసి హరిద్వార్ లాంటి ప్రదేశాలను చుట్టి వచ్చారు. స్నేహితులతో కలిసి దుబాయ్, కేరళ లాంటి ప్రదేశాలకు విహరయాత్రలు చేసి వచ్చారు. తాజా తన పర్సనల్ లైఫ్ గురించి సమంత ఎమోషనల్‌గా స్పందించడం ఒక్కసారిగా అభిమానులను కుదిపేసింది.

లైఫ్ కుప్పకూలిపోయింది అంటూ
నాగచైతన్యతో విడాకులు తీసుకోవడంపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా నా వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ కుప్పకూలిపోయింది. నా భవిష్యత్ అంధకారమైనట్టు అనిపించింది. విడాకుల కారణంగా ఓ దశలో చనిపోతానేమో అనే భయం, ఫీలింగ్ కలిగింది. కానీ అలాంటి సంక్షోభం నుంచి బయటకు వచ్చి చాలా స్ట్రాంగ్‌గా మారాను. అంతకు ముందు మానసికంగా నేను చాలా వీక్ అని ఫీలయ్యే దానిని. కానీ ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదురించిన తర్వాత నేను ఎంత స్ట్రాంగ్ అనేది నాకు అర్దమైంది అంటూ సమంత చెప్పారు.

నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్
నాగచైతన్యతో విడాకుల తర్వాత నెటిజన్లు, కొందరు అభిమానులు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కానీ నెటిజన్లు కామెంట్లను పాజిటివ్‌గా తీసుకొని నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకొన్నాను. ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా నా కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. తాను ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొన్నాను. భవిష్యత్ ఎలా ముందుకు తీసుకెళ్తుందో అలా వెళ్తాను అని సమంత చెప్పింది.

మానసికంగా కుంగిపోతానని
నాగచైతన్యతో విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోయి క్షోభకు గురి అవుతానని అనుకొన్నాను. కానీ ఇప్పుడు నా జీవితాన్ని చూసుకొంటే నాకే ఆశ్చర్యం కలుగుతున్నది. నాలో ఇంత మానసిక బలం ఉందా? అనే విషయం నాకే ఆశ్చర్యం కలిగిస్తున్నది. నన్ను నేను చూసుకొంటే చాలా గర్వంగా ఉంది. ఇంతకు ముందు నేను ఇలా ఉంటానని ఎన్నడూ ఊహించలేదు అంటూ తన భావాలను వ్యక్తం చేసింది. ప్రస్తుతం సమంత చెప్పిన మాటలు టాలీవుడ్ వర్గాల్లో పలు రకాల చర్చకు దారి తీసాయి.

యశోదగా సమంత సరికొత్త సినిమా
ఇదిలా ఉండగా, సమంత తన ప్రొఫెషనల్ లైఫ్‌ను చక్క బెట్టుకొంటున్నట్టు కనిపించింది. ఇటీవల ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీదేవి మూవీస్ నిర్మించే యశోద చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా షూటింగ్ ముగించుకొంటే.. 2022 వేసవిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











