Samantha Ruth Prabhu బాలీవుడ్ మూవీకి ముహుర్తం ఖరారు.. యువ హీరోతో కలిసి యాక్షన్ డ్రామా!
ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో సమంత రుత్ ప్రభుకు అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. తనకు ఉన్న క్రేజ్‌ను అనుకూలంగా మలుచుకొనేందుకు సమంత ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన పలు క్రేజీ ప్రాజెక్టులపై సమంత దృష్టిపెట్టింది. ఆ క్రమంలోనే బాలీవుడ్‌లో సమంత రుత్ ప్రభు తొలి సినిమాకు ముహుర్తం ఖరారైంది.
ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రుస్సో బ్రదర్స్ నిర్మించే సిటాడెల్ చిత్రంలో నటించనున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సమంత నటించనున్నది. వరుణ్, సమంత కలిసి నటించడం ఇదే మొదటిసారి అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నది.

సిటాడెట్ సినిమాకు సంబంధించి బాలీవుడ్ మీడియా వెల్లడించిన ప్రకారం.. ఈ చిత్రం ముంబైలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విదేశాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటుంది. యూరప్, ఇతర దేశాల్లో ఈ సినిమాను షూట్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. త్వరలోనే లోకేషన్ల ఎంపికను పూర్తి చేసి షూటింగ్ చేపడుతారు అని పేర్కొన్నారు.
సిటాడెల్ చిత్రంలో వరుణ్ ధావన్‌కు హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు ఉంటాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌లో మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకోసం వరుణ్ ధావన్ శిక్షణ తీసుకొంటున్నాడు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.

సమంత రుత్ ప్రభు సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా? ఊఊ అంటావా ఓ స్పెషల్ సాంగ్ సమంత నటించింది. ఈ పాటలో స్టెప్పులు వేసినందుకు సమంతకు మంచి రెస్సాన్స్ లభించింది. ఇక యశోదా అనే చిత్రంలోను, అలాగే తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్‌లో నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. సమంత నటించిన శాకుంతలం సినిమా పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా మంచి రెస్పాన్ వచ్చింది.


Click it and Unblock the Notifications











