టెర్రరిస్ట్ లుక్ లో సమంత..బర్త్ డే నాడు రివీల్.. ఆగలేకపోతున్నామంటూ !
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నేడు 34 పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. టాలీవుడ్ కి ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యను పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లోకి కూడా ఆమె ఎంట్రీ ఇస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద కూడా మంచి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో సమంత నటిస్తుండం. అదీ కాక అది టెర్రరిస్ట్ పాత్ర కావడం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల అవ్వాల్సి ఉంది.
ఫిబ్రవరి 12న ఈ వెబ్ సిరీస్‌కు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే అనుకోని కారణాల వలన ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదల కాలేదు. అప్పటికే అమెజాన్‌లో విడుదలైన తాండవ్, మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్‌లు వివాదంలో చిక్కుకోవడంతో.. ఓటీటీలో విడుదలయ్యే సిరీస్‌లు, సినిమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2, పాతాళ్ లోక్ 2 వెబ్ సిరీస్‌ల రిలీజ్ లను అమెజాన్ క్యాన్సిల్ చేసిందని టాక్ నడిచింది.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పటిదాకా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత లుక్ రిలీజ్ చేయ లేదు మేకర్స్. కేవలం బ్యాక్ నుండి సమంత లుక్ ని మాత్రమే రిలీజ్ చేశారు. ఈ రోజు సమంత బర్త్ డే సందర్భంగా రాజ్ నిడిమోరు - కృష్ణ డీకేతో కలిసి ఉన్న సమంత లుక్ తమ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సమంత కార్గో ప్యాంట్ మరియు టీ షర్టు, ఆ పైన చొక్కా ధరించి ఉండగా ఆమె ముఖం మీద గ్రీజు మరకలు కూడా ఉన్నాయి. ఈ పిక్ షేర్ చేసి "పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్! హ్యాపీ డే రచ్చ చేస్తనే ఉండు! 'రాజీ'ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేచి ఉండలేము... అతి త్వరలో వచ్చేస్తోంది! "అంటూ రాజ్ మరియు డీకేలు పేర్కొన్నారు. మొత్తం మీద సమంత లుక్ మాత్రం రచ్చ రేపుతోంది.


Click it and Unblock the Notifications











