India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha Ruth Prabhu. కెరీర్ లో బిగ్గెస్ట్ డీల్.. ఒకేసారి 20కోట్ల ఆఫర్?

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మొన్నటివరకు అగ్ర స్థాయిలో పారితోషికం అందుకున్న సమంత రానున్న రోజుల్లో తన స్థాయిని మరింత పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఆమె విడాకుల అనంతరం సరికొత్త తరహాలో అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ నుంచి కూడా సమంతకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఇటీవల సమంతకు వచ్చిన ఒక ఆఫర్ తో ఒకేసారి 20కోట్లకు పైగా పారితోషికం అందుకునే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

  ఆ ట్రెండ్ కు బ్రేక్ వేసి..

  ఆ ట్రెండ్ కు బ్రేక్ వేసి..

  నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత సమంత మళ్ళీ సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. చాలావరకు ఎంత పెద్ద స్టార్స్ అయినా పెళ్లి అనంతరం కొన్నాళ్ళు సినిమాలు చేయకుండా ఉంటారు లేదంటే గ్లామర్ డోస్ తగ్గించి కేవలం ఒక తరహా పాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. కానీ సమంత ఆ ట్రెండ్ కు బ్రేక్ వేసి అంతకుమించి అనేలా తన కెరీర్ ను తనకు నచ్చినట్లు మలుచుకుంది.

  ఆ వెబ్ సీరీస్ తో..

  ఆ వెబ్ సీరీస్ తో..

  సమంత - నాగ చైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న తరువాత ఎవరి కెరీర్ లో వారు చాలా బిజీ అయ్యారు. ముఖ్యంగా సమంత తన జీవితాన్ని సరికొత్త దారులలో కొనసాగిస్తోంది. తన వ్యక్తిగత జీవితం సినిమా కెరీర్ పై పడకుండా కూడా ఆమె జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోంటోంది. ఇక మొత్తానికి అన్ని భాషల్లో క్రేజ్ అందుకునేలా ఆమె చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సీరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

  మరో ఇంట్రెస్టింగ్ వెబ్ ప్రాజెక్ట్

  మరో ఇంట్రెస్టింగ్ వెబ్ ప్రాజెక్ట్

  ఆ ఒక్క వెబ్ సీరీస్ తోనే సమంత గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ కోలీవుడ్ లోనే కాకుండా పలు ఇంగ్లీష్ ప్రాజెక్టులలో కూడా అవకశాలు అందుకుంటోంది. ఇక ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే కాంబినేషన్లో చేస్తున్న మరొక యాక్షన్ వెబ్ సీరీస్ కోసం వర్క్ షాప్ లో పాల్గొంటోంది. ఆ యాక్షన్ సీరీస్ లో వరుణ్ ధావన్ మేయిన్ హీరోగా నటిస్తున్నాడు.

  యష్ రాజ్ ఫిలిమ్స్ లో..

  యష్ రాజ్ ఫిలిమ్స్ లో..

  ఇక ఇటీవల బాలీవుడ్ నుంచి సమంతకు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్ల కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ యష్ రాజ్ ఫిలిమ్స్ లో సమంత నటించనున్నట్లు టాక్ గట్టిగానే వస్తుంది. దేశంలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా ఏళ్లనాటి చరిత్ర కలిగిన యష్ రాజ్ ఫిలిమ్స్ అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. వారి సంస్థలో ఛాన్స్ వస్తే చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయరు. ఇక సమంత కూడా ప్రస్తుతం వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలోనే ఉందట.

  20కోట్లకు పైగా రెమ్యునరేషన్..

  20కోట్లకు పైగా రెమ్యునరేషన్..


  యష్ రాజ్ ఫిలిమ్స్, సమంతతో ఒకేసారి మూడు ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. అందుకోసం ఆమెకు ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లకు గాను 20కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. తెలుగు తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న సమంత ఒక్కో సినిమాకు 4కోట్లకు పైగానే డిమాండ్ చేస్తోంది. ఇక యష్ రాజ్ తో సినిమాలు అంటే అన్ని భాషల్లో మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆమె గట్టిగానే డిమాండ్ చేసినట్లు సమాచారం.

  English summary
  Samantha upcoming projects with bollywood big production with shocking remuneration,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X