For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి వార్తల్లోకి అక్కినేని వారి కోడలు: సింగపూర్‌ ఆస్పత్రికి సమంత.. అందుకే అంటున్నారు.!

  By Manoj
  |

  సమంత అక్కినేని.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఇది. అక్కినేని నాగ చైతన్య నటించిన 'ఏమాయ చేశావే' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. తాజాగా ఈమె సింగపూర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లిందని తెలుస్తోంది. దీని వెనుక కారణం కూడా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

  ఇక్కడా.. అక్కడా సత్తా చాటింది

  ఇక్కడా.. అక్కడా సత్తా చాటింది

  వరుస విజయాలతో దూసుకుపోతోంది అక్కినేని సమంత. కొన్నేళ్ల కిందట వచ్చిన ‘అఆ' మూవీ నుంచి ఆమె వరుసగా ‘జనతా గ్యారేజ్', ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ' వంటి విజయాలను దక్కించుకుంది. అలాగే, తమిళంలోనూ ఆమె పలు హిట్ చిత్రాల్లో నటించింది. ‘మెర్సల్', ‘ఇరుంబుతిరై', ‘సూపర్ డీలక్స్'లో ఆమె నటన ఆకట్టుకుంది.

  హిట్ సినిమాతో వస్తున్న సమంత

  హిట్ సినిమాతో వస్తున్న సమంత

  ‘ఓ బేబీ' తర్వాత సమంత పెద్దగా సినిమాలను ఒప్పుకోవడం లేదు. అంతకు ముందే సంతకం చేసిన ‘జాను'లో మాత్రమే నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96'కు రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో శర్వానంద్ హీరోగా చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్ వస్తోంది.

  ఆ రెండు చోట్లా అడుగు పెడుతోంది

  ఆ రెండు చోట్లా అడుగు పెడుతోంది

  ఇప్పటి వరకు సినిమాల్లో మెప్పించిన సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెడుతోంది. ఇందులో ఆమె నెగెటివ్ రోల్ చేస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, సామ్ త్వరలోనే ఓ టాక్ షో ద్వారా తెలుగు బుల్లితెరలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

  తల్లి కాబోతున్న సమంత.. అస్సలు ఆగలేదు

  తల్లి కాబోతున్న సమంత.. అస్సలు ఆగలేదు

  ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన సమంత.. ఈ మధ్య వాటిని తగ్గించడంతో చాలా వార్తలు ప్రచారం అయ్యాయి. వాటిలో ముఖ్యంగా సామ్ తల్లి కాబోతుందన్న వార్త హాట్ టాపిక్ అయింది. అక్కినేని వారి కోడలు తల్లి కావాలనుకుంటోందని, అందుకే సినిమాలను ఒప్పుకోవడం లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

  సింగపూర్‌ ఆస్పత్రికి వెళ్లిన సమంత

  సింగపూర్‌ ఆస్పత్రికి వెళ్లిన సమంత

  కొద్ది రోజుల క్రిందట సమంత సింగపూర్ వెళ్లింది. ఆ సమయంలో ఆమె అక్కడ దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అసలు ఆమె సింగపూర్ ఎందుకు వెళ్లింది అన్న దానిపై తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. భర్తతో కలిసి వెళ్లిన ఈ టూర్‌లో భాగంగా సామ్.. ఆ నగరంలోని ఓ ఆస్పత్రికి వెళ్లిందని అంటున్నారు.

  Jaanu Teaser : Fans Comparing Samantha With Trisha || Jaanu Vs 96
  అసలు కారణం బయటకు వచ్చింది

  అసలు కారణం బయటకు వచ్చింది

  సమంత.. సింగపూర్‌లోని ఆస్పత్రికి వెళ్లిందని అప్పుడూ ఇప్పుడూ ప్రచారం జరుగుతోంది. దానికి కారణం... ఆమె అక్కడ ఓ క్లినిక్‌లో థెరఫీ చేయించుకుందట. అయితే, ఈ థెరఫీ దేనికి.? ఎందుకు చేయించుకుంది.? అన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. దీంతో అక్కినేని వారి కోడలు మరోసారి వార్తల్లోకి ఎక్కేసింది.

  English summary
  Samantha Akkineni is an Indian actress. She has established a career in the Tamil and Telugu film industries, and is a recipient of several awards including four Filmfare Awards. She has emerged as a leading actress in the South Indian film industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X