Don't Miss!
- News
స్మితా ఇంటికి ప్రమోషన్లపై చర్చించేందుకే వెళ్లా: ఆనంద్ కుమార్, రాత్రే ఎందుకంటే?
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్పై వెటరన్ కామెంట్స్!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
దుర్బర పరిస్థితుల్లో శృతి హాసన్ తల్లి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం!
హీరోగా కమల్ హాసన్ అద్భుతమైన సినిమాలు చేయడమే కాక అనేక అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదం అనే చెప్పాలి. తొలుత వాణి గణపతి అనే ఒక డ్యాన్సర్ ని వివాహం చేసుకున్న ఆయన సుమారు పదేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత విడిపోయారు. ఆ తర్వాత సారికను వివాహం చేసుకున్నారు. ఆమెతో ఆరేళ్ల వివాహ జీవితం అనంతరం మళ్లీ విడిపోయారు. ఆ తర్వాత గౌతమితో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమె నుంచి కూడా దూరమయ్యారు. అయితే ఆయనకు సారిక ద్వారా శృతి హాసన్, అక్షర హాసన్ అనే కుమార్తెలు కూడా ఉన్నారు. వీరు ఇద్దరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శృతి హాసన్ తల్లి సారిక కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. కానీ సుమారు ఐదేళ్ల నుంచి ఆమె పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ఈ విషయం మీద ఆమె స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను మొదట ఒక ఏడాది బ్రేక్ తీసుకోవాలి అని అనుకున్నాను అని అది అలా అలా మొత్తం ఐదు సంవత్సరాలు బ్రేక్ తీసుకునేలా చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాక కరోనా సమయంలో అయితే డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని చాలా దుర్భరమైన పరిస్థితులు ఫేస్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు. జీవితం అంతా రొటీన్ అయిపోయింది, ఒకరకంగా జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాం ఏమో అనిపించింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం, మనం అనుకున్న పనులు జరగక పోవడం మళ్ళీ నిద్ర పోవడం ఇలా రొటీన్ లైఫ్ కాకుండా ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకోవాలి అని అనుకున్నాను. కొత్తగా కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాను అలా ఒక ఏడాది తీసుకున్న బ్రేక్ లో ఐదేళ్లు పూర్తయ్యాయి. మధ్యలో కరోనా ఎంటర్ అయిన తర్వాత లాక్ డౌన్ పెట్టారు లాక్ డౌన్ సమయంలో నా చేతిలో డబ్బులు పూర్తిగా అయిపోయాయి.

అప్పుడు ఏం చేయాలి అనుకుంటే మళ్ళీ యాక్టింగ్ చేయాలని అనిపించింది స్టేజ్ షోలు చేస్తే రోజుకు రెండు వేల నుంచి 2,700 రూపాయల వరకు వస్తాయి. అంతకు మించి ఏమీ చేయలేము అందుకే నేను మళ్ళీ కనిపించలేదు. అలా మనస్ఫూర్తిగా ఏడాది బ్రేక్ తీసుకోవాలి అని అనుకుంటే ఆ బ్రేక్ ఐదేళ్లకు ఎక్స్టెండ్ అయింది. అయితే ఈ ఐదేళ్లు మాత్రం చాలా అద్భుతంగా గడిచాయి అని సారిక చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు ఆమె నటనలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం చేసిన ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ మోడ్రన్ లవ్:న్ ముంబై లో ఆమె నటించారు. మే 13 న ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవుతోంది. ఇది మాత్రమే కాకుండా సూరజ్ బర్జాత్యా సినిమాలో కూడా సారిక భాగమయ్యారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లాక్ డౌన్ సమయంలో తాను కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ శ్రుతి హాసన్ కూడా ఆ మధ్యన వేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.