2 ఏళ్లపాటు ఒకే హోటల్లో శ్రీదేవి.. ఆ ఫుడ్ కోసం అతిలోక సుందరి తహతహ!
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా వ్యాప్తంగా ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. స్టార్ హీరోలకు ధీటుగా శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజ్ సంపాదించుకుంది. 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. మద్రాస్ లోని మీనంపట్టిలో పుట్టి పెరిగిన శ్రీదేవి దేశ వ్యాప్తంగా నటిగా సంచలనంగా సృష్టించారు. తెలుగు, తమిళం, హిందీ, మాలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఆయా భాషల్లో స్టార్ హీరోలకు ధీటుగా నటించి మెప్పించింది.
1967 నుంచే శ్రీదేవి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ప్రేక్షకులను అలరించడం ప్రారంభించింది. ఇక 1976లో ఆమె తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 13 ఏళ్లకే హీరోయిన్ గా వెండితెరపై మెరియడం విశేషం. అప్పటి నుంచి 2018 వరకు శ్రీదేవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు. దాదాపు దేశంలో ఉన్న ప్రధాన భాషల్లోని అగ్ర హీరోలందరితోనూ శ్రీదేవి కలిసి పనిచేశారు. ఇక చివరిగా ఆమె బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది.

1996లో ఆమె 33వ ఏటా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్, యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్ కు జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీదేవి కూతుళ్లుగా వీరిద్దరూ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు. ఇదెలా ఉంటే శ్రీదేవికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమెకు ఇష్టమైన ఫూడ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
శ్రీదేవి ఒక సందర్భంలో ముంబైలోని జుహూ హోటల్ లో దాదాపు 2 ఏళ్ల పాటు ఉండాల్సి వచ్చిందంట. ఆ హోటల్ లో ఆమెకు ఒక గదిని ఫిక్స్ చేశారంట యాజమాన్యం. సకల సౌకర్యాలను, సిబ్బందిని నియమించి శ్రీదేవికి కావాల్సిన ఏర్పాట్లు చేసేవారంట. అయితే ఆ హోటల్ లో మాత్రం శ్రీదేవి తినేందుకు అస్సలు ఇష్టపడేది కాదంట. ఈ విషయాన్ని ఆ హోటల్ లో చెఫ్ గా పని చేసిన హర్పాల్ సింగ్ సోఖి ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నటి శ్రీదేవి కోసం ప్రత్యేకంగా హరీస్ అనే ప్రాంతం నుంచి ఫుడ్ తీసుకొని వచ్చే వాళ్లమని చెప్పారు. ఆ ప్లేస్ లో మంగళూరు ఆహారాన్ని ప్రత్యేకంగా వండుతారని, ఇక అక్కడ నుంచి శ్రీదేవి ప్రతి రోజు తనకు ఎంతో ఇష్టమైన టిఫిన్స్, ముఖ్యంగా చేపల కూరను తెప్పించుకునే వారు. హోటల్ లో ఉన్న ప్రతిరోజూ చేపల కూర తినేందుకు మాత్రమే ఇష్టపడేదని తెలిపారు. చేపల కూర శ్రీదేవి ఫేవరేట్ ఫుడ్ గా ఆయన తెలిపారు. ఇక తను ఉంటున్న హోటల్ లో కేవలం పప్పు, రైస్ మాత్రమే తినేదని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











