For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

  |

  సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది ఆరోపణలు చేస్తున్నా దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ మీటూ ఉద్యమం వల్ల ఎంతో మంది సినీ ప్రముఖుల బండారాలు బయటకు వచ్చాయి. చాలా మంది నటీమణులు తమకు జరిగిన చేదు అనుభవాలను రివీల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాదీ బ్యూటీ షెర్లిన్ చోప్రా తాజాగా ఓ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  మిస్ ఆంధ్రాగా గెలుపు.. తెలుగు సినిమాలతో

  మిస్ ఆంధ్రాగా గెలుపు.. తెలుగు సినిమాలతో

  కొన్నేళ్లుగా హాట్ షోతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన షెర్లిన్ చోప్రాది హైదరాబాదే. చదువుకుంటున్న సమయంలోనే ఆమె మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొందింది. ఆ తర్వాత 'వెండిమబ్బు' అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందామె. ఆ తర్వాత మంచు విష్ణు 'గేమ్', 'ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించిందీ బ్యూటీ.

  ఇక్కడ బ్రేక్ రాలేదు.. అక్కడ మాత్రం నగ్నంగా

  ఇక్కడ బ్రేక్ రాలేదు.. అక్కడ మాత్రం నగ్నంగా


  టాలీవుడ్‌లో చేసిన సినిమాలు షెర్లిన్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబై వెళ్లిపోయింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. 2012లో ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఆ తర్వాత సంచలన చిత్రం 'కామసూత్ర 3డీ'లోనూ పూర్తి నగ్నంగా కనిపించింది. అయితే, ఈ సినిమా విడుదల అవలేదు.

  ఎప్పుడు చూసినా అదే పని... ఇదో వ్యాపారం

  ఎప్పుడు చూసినా అదే పని... ఇదో వ్యాపారం


  సినిమా షూటింగులు లేకపోవడంతో షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే, తన కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలా చేసి ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. అలాగే, ఆమెకు ఓ యాప్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

  మొత్తం అలాంటి ఫొటోలు.. వీడియోలే పోస్టు

  మొత్తం అలాంటి ఫొటోలు.. వీడియోలే పోస్టు

  షెర్లిన్ చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిలో ఎక్కువగా గ్లామర్ షో చేసేవే ఉంటాయి. మరీ ముఖ్యంగా హాట్ ఫోటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. అంతేకాదు, వీటిలో చాలా వరకు తన ఎద అందాలను చూపించేవే ఉంటాయి. వీటికి నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తుండడంతో అమ్మడు మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా వాటిపైనే ఫోకస్ చేస్తోంది.

  ఆ డైరెక్టర్‌పై షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

  ఆ డైరెక్టర్‌పై షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే షెర్లిన్ చోప్రా తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ షాజీద్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూను తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. 'నా తండ్రి చనిపోయిన తర్వాత అంటే 2005 ఏప్రిల్‌లో షాజీద్ నన్ను రూంకి పిలిచాడు. సినిమాకు సంబంధించిన డిస్కర్షన్ జరుగుతోన్నప్పుడు చెడుగా ప్రవర్తించాడు' అని చెప్పింది.

  రూంకి పిలిచి ప్రైవేట్ పార్ట్ చూపించాడు అంటూ

  రూంకి పిలిచి ప్రైవేట్ పార్ట్ చూపించాడు అంటూ

  దీనిని కొనసాగిస్తూ.. 'నాతో మాట్లాడుతూనే షాజీద్ ఎక్కడెక్కడో తాకాడు. ఆ తర్వాత తన ఫ్యాంట్ విప్పి మర్మాంగాన్ని చూపిస్తూ టచ్ చేయమన్నాడు. అంతేకాదు, ఆ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పమన్నాడు. సైజ్ కూడా కొలవమన్నాడు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. తర్వాత ఇదంతా నాలో నేను దాచుకున్నా' అని షెర్లిన్ వివరించింది.

  ఇన్ని రోజులూ ఎందుకు బయట పెట్టలేదంటే

  ఇన్ని రోజులూ ఎందుకు బయట పెట్టలేదంటే

  షెర్లిన్ చోప్రా ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదన్న దానిపైనా క్లారిటీ ఇచ్చింది. 'ఇది జరిగి చాలా ఏళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకూ దీన్ని బయట పెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే.. అప్పుడు ఆయనో పెద్ద డైరెక్టర్. నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిని. నేను ఆయనపై ఆరోపణలు చేస్తే బాలీవుడ్ మాఫియా నన్ను అంతం చేసేది' అని వెల్లడించింది.

  English summary
  Content creator and former actor Sherlyn Chopra has accused film director Sajid Khan of sexual misconduct. Several women have made similar complaints against Sajid, which resulted in a one-year suspension from the Indian Film & Television Directors' Association.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X