Shilpa Shettyని ప్రశ్నించిన క్రైమ్ బ్రాంచ్.. లాప్‌టాప్‌లో 19 బూతు చిత్రాలు లభ్యం
పోర్న్ రాకెట్ కేసులో భర్త రాజ్ కుంద్రాతోపాటు శిల్పాశెట్టికి కష్టాలు తప్పడం లేదు జూలై 19వ తేదీన ఈ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు శుక్రవారం రోజున జూలై 27వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించారు. అనంతరం జుహులోని తమ నివాసంలో రాజ్ కుంద్రాతోపాటు శిల్పాశెట్టిని క్రైమ్ బ్రాంచ్‌లోని ఇంటిలో విచారించారు.

పోలీసు వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఈ కేసులో శిల్పాశెట్టి నుంచి వాగ్మూలాన్ని రికార్డ్ చేసినట్టు సమాచారం. రాజ్ కుంద్రాకు సంబంధించిన వియాన్ ఇండస్ట్రీస్ నుంచి ఎందుకు తప్పుకొన్నారనే విషయాన్ని శిల్పా శెట్టిని అడిగి తెలుసుకొన్నట్టు తెలిసింది.
పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు, మరో డీలర్‌కు మధ్య జరిగిన 19 అడల్ట్ సినిమాల ఒప్పందం గురించి అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. పోర్న్ చిత్రాల వ్యాపారం నుంచి గడించిన డబ్బును బెట్టింగ్‌కు ఉపయోగించినట్టు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దృష్టికి వచ్చింది. కుంద్రా నుంచి లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొన్నారు. 48 టీబీ స్టోరేజ్ ఉన్న లాప్‌టాప్‌లో 51 బూతు చిత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యాపారం ద్వారా ప్రతీ నెలకు 10 వేల పౌండ్లను సంపాదించినట్టు విచారణలో స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











