For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయనతో రిలేషన్ గొప్ప అనుభవం.. బ్రేకప్‌పై మంచులక్ష్మితో నోరువిప్పిన శృతిహసన్

|

సినీ తారలకు వ్యక్తిగత జీవితంలో బ్రేకప్‌లు చాలా సహజమనే విషయాన్ని కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అందుకు అందాల తార శృతిహాసన్ మినహాయింపేమీ కాదు. ప్రియుడు మైఖేల్ కోర్సలే‌తో బంధం పెళ్లి వరకు వచ్చి పెటాకులు కావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కేవలం అఫైర్ కారణంగా తెలుగు సినిమాలకు, దక్షిణాది సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ తాజాగా తన బ్రేకప్ గురించి సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఇటీవల మంచు లక్ష్మీ ఫీట్ అప్ విత్ ద స్టార్స్ అనే షోలో శృతిహాసన్ మీడియా మాట్లాడుతూ..

మైఖేల్ కోర్సలేతో నా రిలేషన్

మైఖేల్ కోర్సలేతో నా రిలేషన్

మైఖేల్ కోర్సలేతో నా రిలేషన్ బాగానే ఉండేది. జీవితంలో కొన్ని అంచనాలు ఉంటాయి. వారి గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేం. నేను చాలా ప్రశాంతంగా మనస్తత్వం నాది. వాస్తవానికి నేను బయటకు కనిపించనట్టు కాకుండా అమాయకురాలినే. బయట ప్రపంచంలో అందరూ నాపై బాస్‌గా వ్యవహరిస్తారు. అలాగే నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ను అని శృతిహాసన్ అన్నారు.

మైఖేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం

మైఖేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం

మైఖేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం. ఈ దశలో ప్రేమ వైఫల్యం నాకు గొప్ప అనుభవాన్ని కలిగించింది. లవ్‌లో పడటానికి ఫార్ములా ఉండవనే నా అభిప్రాయం. లవ్ అనే ఓ ఫీలింగ్ మాత్రమే. మన టైమ్ బాగుంటే.. అందరూ మంచివాళ్లే. మన టైమ్ బ్యాడ్ అయితే అందరూ చెడ్డవాళ్లుగా కనిపిస్తారు. బ్రేకప్ విషయంలో నేను తప్పు చేశాననే ఫీలింగ్ లేదు. ఓవరాల్‌గా మంచి అనుభవం. జీవితంలో రోజు నేర్చుకొనే ఓ పాఠాల్లో ఒకటి అని శృతి హాసన్ పేర్కొన్నారు.

నాపై ఎలాంటి ప్రభావం

నాపై ఎలాంటి ప్రభావం

మైఖేల్‌తో బ్రేకప్ నాపై ఎలాంటి ప్రభావం చూపదు. గొప్ప ప్రేమ ఎక్కడ దొరుకుందా అని వెతుకుతూనే ఉంటాను. ప్రేమలో మునిగి తేలిపోవడానికి నేను ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను అని శృతిహాసన్ పేర్కొన్నారు. లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో ప్రేమలోపడటం, చెన్నైలో ఓ పెళ్లికి నవదంపతుల్లా హాజరుకావడం మీడియాలో కనిపించిన సంగతి తెలిసిందే.

జీవితం ప్రతీ రోజు ఓ పరీక్షే

జీవితం ప్రతీ రోజు ఓ పరీక్షే

జీవితం మనల్ని ఎప్పుడూ ప్రతికూల పరిస్థితులతో పరీక్షిస్తుంది. వాటిని మనం ఎదుర్కొనడమే మనకు ఉన్న ఏకైక లక్ష్యం. ఏదో బ్రేకప్ జరిగిందని ఎవర్నీ దూషించను. నా చుట్టూ చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. వారికి నేను మంచి స్నేహితురాలిగా ఉండటమే నా కర్తవ్యం అని శృతిహాసన్ పేర్కొన్నారు.

శృతి కెరీర్‌లో

శృతి కెరీర్‌లో

ప్రస్తుతం శృతిహాసన్ హాలీవుడ్‌లో ట్రెడ్‌స్టోన్‌లో నటిస్తున్నది. అంతేకాకుండా తమిళంలో లాబమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

English summary
Shruti Haasan about breakup with Michael Corsale in Manchu Lakshmi show. She speaks openly about her relation with Michael Corsale. She said break up is good experience.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more