వాళ్లు విడిపోవడమే సంతోషం.. తండ్రి బ్రేకప్‌పై శృతిహాసన్ హాట్ కామెంట్!
సినీ నటి, అందాల రాశి శృతిహాసన్ తన బ్రేకప్ గురించి గానీ, రిలేషన్‌షిప్స్ గురించి ముక్కుసూటిగా మాట్లాడటం అందరికి తెలిసిందే. తన డేటింగ్ వ్యవహారాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తన వ్యక్తిగతం అంటూ తొణుకుబెణుకు లేకుండా మాట్లాడటం ఆమె చెల్లుతుందని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. తాజాగా తన తండ్రి కమల్ హాసన్ బ్రేకప్ వ్యవహారంపై స్పందిస్తూ...

కమల్, సారిక వివాహం
విలక్షణ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ నటి సారిక ఇద్దరు ప్రేమలో పడ్డటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వారి ప్రేమను మరో మెట్టు ఎక్కిస్తూ 1988లో వివాహం చేసుకొన్నారు. 1986లో శృతిహాసన్‌కు, 1991 అక్షర హాసన్‌కు జన్మనిచ్చారు. అయితే దాదాపు 18 సంవత్సరాల వివాహ బంధం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయి.

వివాహ బంధంలో విభేదాలు
అయితే కమల్, సారిక తమ వివాహ బంధంలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించలేనంత స్థాయికి చేరుకోవడంతో వారిద్దరూ 2004లో విడాకులు తీసుకొన్నారు. అయితే తన తల్లితండ్రి విడాకులపై స్పందిస్తూ.. వారిద్దరు కలిసి ఉన్న సమయంలో కంటే విడిపోయిన తర్వాతే చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ శృతిహాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

విడిపోవడమే ఉత్తమం..
వ్యక్తిగత, వైవాహిక జీవితాల్లో ఉండలేని పరిస్థితుల్లో విడిపోవడమే ఉత్తమం అని భావిస్తాను. ఏదో ఒక కారణం కోసం బలవంతంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదు. వేర్వేరుగా జీవించాలని నా తల్లిదండ్రులు నిర్ణయించుకొని మంచి నిర్ణయం తీసుకొన్నారు. వారిద్దరి నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అంటూ కామెంట్ చేశారు.

నా తల్లిదండ్రులతో మా రిలేషన్
నా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాతే చాలా సంతోషంగా ఉన్నారు. వారిద్దరికి పిల్లల పట్ల సమాన బాధ్యత ఉంటుంది. నాకు నాన్నతో ఎంత అనుబంధం ఉందో.. అమ్మతో కూడా అంతే రిలేషన్ ఉంది. వారిద్దరంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. వ్యక్తిగతం మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని శృతిహాసన్ చెప్పారు.
Recommended Video

పెయింటర్‌తో డేటింగ్ చేస్తున్న శృతిహాసన్
ఇక శృతిహాసన్ విషయానికి వస్తే.. వ్యక్తిగతంగా ఓ పెయింటర్‌తో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు. శంతను హజారికాతో కలిసి తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రభాస్‌తో సలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటించారు. ఆ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











