For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. తద్వారా ఫుల్ పాపులర్ అవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకున్నారు. అలాంటి వారిలో 'సీతా రామం' హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒకరు. ఒకే ఒక్క చిత్రంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయిన ఈ భామ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా వ్యభిచార గృహంలో గడిపిన విషయాలు చెప్పి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన మృణాల్‌ ఠాకూర్‌.. 'ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్' అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే 'విట్టి దండు' అనే మరాఠీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. అప్పటి నుంచి వరుసగా మూవీలు, సీరియళ్లు, ఆల్బమ్‌లు చేసి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  తెలుగులోకి సీతగా పరిచయం

  తెలుగులోకి సీతగా పరిచయం


  ఇప్పటికే బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'సీతా రామం'తో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. భారీ అంచనాలతో ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మృణాల్ ఠాకూర్‌కు టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.

  ఫుల్ పాపులర్... వరుస ఆఫర్లు

  ఫుల్ పాపులర్... వరుస ఆఫర్లు


  'సీతా రామం' హిట్‌తో మృణాల్ ఠాకూర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. మరీ ముఖ్యంగా ఇక్కడి కుర్రాళ్లకు ఆమె క్రష్‌గా మారింది. ఫలితంగా ఫాలోయింగ్‌ను అమాంతం పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇలా ఇప్పటికే మృణాల్ ఠాకూర్ తెలుగులో కొన్ని సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

  టాలీవుడ్ స్టార్ హీరోతో భయానక అనుభవం.. నాలుగో నెల కడుపుతోనే: రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు

  సెన్సేషన్‌గా.. డేట్స్ కావాలని

  సెన్సేషన్‌గా.. డేట్స్ కావాలని


  గతంలో హిందీలో పలు చిత్రాలు, సీరియళ్లు చేసినా మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే ఎనలేని క్రేజ్ వచ్చింది. అదే సమయంలో ఈ మూవీ వల్ల ఆమె దక్షిణాదిలోనూ ఫేమస్ అయింది. దీంతో తెలుగు ఫిల్మ్ మేకర్లే కాదు.. దక్షిణాది భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. కానీ, ఆమె మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

  వ్యభిచార గృహంలో మృణాల్

  వ్యభిచార గృహంలో మృణాల్


  'సీతా రామం' సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు, చిట్ చాట్‌లు జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా గతంలో తాను ఎదుర్కొన్న క్లిష్టమైన వ్యభిచార గృహ అనుభవం గురించి మృణాల్ ఠాకూర్ మీడియాతో పంచుకుని అందరికీ షాక్ ఇచ్చేసింది.

  హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

  డిప్రెషన్‌లోకెళ్లిన హీరోయిన్

  డిప్రెషన్‌లోకెళ్లిన హీరోయిన్


  2018లో మృణాల్ ఠాకూర్ 'లవ్ సోనియా' అనే సినిమాలో నటించింది. ఇందులో మహిళల అక్రమ రవాణా నుంచి తన చెల్లిని కాపాడే పాత్రను చేసింది. ఈ సినిమాలో తన పాత్రను రియలిస్టిక్‌గా చేయాలన్న ఉద్దేశంతో మృణాల్ ఠాకూర్ దాదాపు రెండు నెలల పాటు వ్యభిచార గృహాల్లో గడిపినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందట.

   ఆయన వల్లే కోలుకున్నానని

  ఆయన వల్లే కోలుకున్నానని

  ఈ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. 'వ్యభిచార గృహాల్లోని అమ్మాయిల బాధలు, కన్నీటి గాథలను విన్న తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో డైరెక్టర్ తబ్రేజ్ నూరానీ నాకు బాసటగా నిలిచి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆయన వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాను. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేను' అంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయింది.

  English summary
  Sita Ramam Actress Mrunal Thakur Recently Participated in an Interview. She Shares her Experience at Prostitute's House for Hindi Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X