‘నేను రాత్రుల్లో ఒక్కదాన్నే పడుకోలేను.. అవుట్ డోర్ షూటింగ్స్‌లో కూడా’

స్టార్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యలో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్, వరుస హిట్స్ అందుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. త్వరలోనే తన తొలి హిందీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోని తన ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ క్రమంలో తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్ గా ప్రారంభమైన జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకు శ్రీలీలా హాజరైంది. ఈ సందర్భంగా తన తల్లి స్వర్ణలత గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. టాక్ షోకు హాజరైన సందర్భంగా జగపతి బాబు శ్రీలీలాను ఒక ప్రశ్న అడిగారు. నీ గురించి ఇండస్ట్రీలో ఒక కంప్లైంట్ ఉంది. ప్రతి దానికి అమ్మా అమ్మా అని అంటూ ఉంటావంటా? ఏది అడిగినా, ఏది ఓకే చెప్పాలన్నా మీ అమ్మని అడగాలని చెబుతావంటా నిజమైనా? నువ్వు కూడా దీని గురించి క్లారిటీ ఇవ్వాలని అనుకున్నావని తెలుస్తోందని జగపతి బాబు శ్రీలీలాను ప్రశ్నిస్తాడు.

Sreeleela Emotional Words About her Mother

ఇక శ్రీలీలా మాట్లాడుతూ.. 'అది నాకు తల్లి ప్రేమ నుంచే వచ్చింది. ఇప్పటికీ నేను నా పనులన్నీ నా స్వతహాగా చేసుకుంటున్నాని నమ్మకం లేదు. ఇండివిజుయలిటీ లేదు. అమ్మ లేకుంటే నేను లేను అంతే. ఇక రీసెంట్ గా 6 నెలల కింద కూడా మా అమ్మ లేకుండా నేను పడుకోలేకపోయాను. రాత్రుల్లో అమ్మ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒక్కదాన్నే పడుకోలేను. మేలుకవచ్చేస్తుంటది. ఉలిక్కి పడి లేచి వణికిపోతూ ఉంటాను. దాంతో అమ్మ గట్టిగా పట్టుకొని ఏంటని నన్ను నార్మల్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ అమ్మ పక్కన ఉండాల్సిందే.

నేను అవుట్ డోర్ షూట్స్ కు వెళ్లినా కూడా అమ్మ ఉండాల్సిందే. అమ్మ లేకుంటే ఉండటం కష్టంగా ఉంటుంది. ఇక నా తల్లిని అమ్మ అని పిలుస్తాను. అస్సలు అమ్మకు చెప్పకుండా ఎలాంటి పనులు చేయన'ని చెప్పింది. ఇక మా అమ్మకు మీరంటే చాలా ఇష్టమని జగపతి బాబుతో చెప్పింది. అందుకే తెలియకుండానే మీకు మ్యాచ్ అయ్యే డ్రెస్ కూడా ధరంచి వచ్చిందని చెప్పింది. ఇక చిన్నప్పటి నుంచి తనను ఎంతో ప్రేమగా చూసుకుందని చెప్పుకొచ్చింది. అదే సమయంలో తనను కొట్టేది కూడా అని చెప్పింది. ఏదీ చేసినా అమ్మతో చాలా సరదాగా ఉంటానని తెలిపింది.

ఇక శ్రీలీలా చివరిగా ఎక్ట్స్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంతో అలరించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక నెక్ట్స్ లెనిన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X