Sreeleela: అందుకే పుష్ప 2 ఐటమ్ సాంగ్ చేశా.. నిజం బయటపెట్టిన శ్రీలీల

Sreeleela: టాలీవుడ్‌లో డ్యాన్స్ అంటే గుర్తొచ్చే పేర్లలో శ్రీలీల ఒకటి. తన ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి శ్రీలీల. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎన్నో సినిమాల్లో తన ఎనర్జీతో పాటలను చార్ట్‌బస్టర్ హిట్‌లుగా మార్చిన ఈ బ్యూటీ, 'పుష్ప 2'లో అల్లు అర్జున్‌తో కలిసి 'కిసిక్' సాంగ్‌తో రొమాంటిక్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. అయితే.. పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం వెనుక ఉన్న అసలు విషయాన్ని వెల్లడించింది శ్రీలీల. ఇంతకీ ఏమన్నారంటే..

టాలీవుడ్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా నిలిచింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ, హిట్ లేదా ఫ్లాప్ అనే తేడా లేకుండా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

Sreeleela Reveals Why She Did Pushpa 2 Item Song Real Reason Behind Kisiki Song

ప్రస్తుతం శ్రీలీల చేతిలో వరుస ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ "మాస్ జాతర" సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లో మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాల టాక్.

సినిమాల షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, శ్రీలీల తన అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది ఈ భామ, ఇలాంటి అమ్మడు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ గురించి ఇప్పటికీ సినీ వర్గాల్లో చర్చనీయమే. "కిసిక్" అనే స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల చేసిన డ్యాన్స్‌ స్టెప్స్‌లేశారు. ఈ మాస్ డ్యాన్స్ ఇండస్ట్రీని షేక్ చేసింది. సాధారణంగా శ్రీలీల ఒక్కో సినిమాకు సుమారు కోటి రూపాయల పారితోషికం తీసుకుంటుందని టాక్. కానీ పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం ఈ బ్యూటీ రూ. 2 కోట్లు వసూలు చేసిందట. తాజాగా శ్రీలీల ఓ మీడియా ఇంటర్వ్యూలో 'పుష్ప 2' లో చేసిన ఐటమ్ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సాంగ్ చేయడానికి గల అసలు కారణాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో నన్ను చాలామంది బెస్ట్ డ్యాన్సర్‌గా మాత్రమే చూస్తున్నారు. కానీ నేను కేవలం డ్యాన్సర్ కాదు, మంచి నటిని కూడా. 'భగవంతు కేసరి' సినిమాలో ఇచ్చిన నా పర్ఫామెన్స్‌ అందరికీ తెలిసినదే. అయినా కూడా నన్ను ఇప్పటికీ డ్యాన్సర్‌గా మాత్రమే చూస్తున్నారు. ఆ పర్సెప్షన్‌ను మార్చడం అంత తేలిక కాదు.ఎవరి అభిప్రాయాలు వారివి. నా పని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం. ప్రతి సినిమాలో కొత్తగా ఏదైనా చూపించాలని ప్రయత్నిస్తాను," అని చెప్పింది.

యాంకర్ మరో ప్రశ్న వేశారు "పుష్ప 2లో చేసిన ఐటమ్ సాంగ్ మీ కెరీర్‌పై ఎఫెక్ట్ చూపిందా?" అని. దానికి శ్రీలీల సమాధానమిస్తూ "అవును, ఆ సినిమా నా కెరీర్‌పై ప్రభావం చూపింది. అలాంటి పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం నాకు గర్వకారణం. కానీ ఇలాంటి ఐటమ్ సాంగ్స్ వేరే సినిమాల్లో మాత్రం చేయను. 'పుష్ప 2' వేరు. అల్లు అర్జున్, సుకుమార్ వంటి టాలెంటెడ్ టీమ్‌తో పనిచేయడం ఒక ప్రత్యేక అనుభవం. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించే సినిమాలో ఓ భాగం అయినా అవ్వడం నాకు గర్వంగా అనిపించింది. అందుకే ఆ సాంగ్ చేశాను," అని బదులిచ్చింది.

అయితే.. ఇకపై ఇలాంటి ఐటమ్ సాంగ్స్‌లో నటించే ఉద్దేశ్యం లేదనీ, తనకు సూటయ్యే పాత్రల్లోనే నటిస్తానని వెల్లడించారు. డ్యాన్స్ నా ప్యాషన్‌ అయినా, నేను యాక్టింగ్‌లో కూడా వేరియేషన్ చూపించాలని భావిస్తున్నానని తెలిపారు శ్రీలీల. ఈ మాటలతో శ్రీలీల అభిమానుల్లో మరోసారి గౌరవాన్ని తెచ్చుకుంది. పుష్ప 2లో ఆమె డ్యాన్స్‌ ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ట్యూన్‌తో కలసి మాస్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చిన్నదైనా, ప్రభావం మాత్రం భారీగా ఉండబోతోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Read more about: pushpa 2 sreeleela allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X