For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమంత, త్రిష లాంటోళ్లు కూడా హెల్ప్ చేయరు... వ్యభిచారం చేయకుంటే ఏం చేస్తారు: శ్రీరెడ్డి

|

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నటి జీవితపై శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. జీవితగారు స్టేజీల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మా లాంటి వారికి 'మా' సభ్యత్వం ఇవ్వమంటే ఇవ్వరు. ఏవో సాకులు చేప్పి నాతో పాటు చాలా మందికి 'మా' కార్డులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించారు.

నేను జీవిత గారికి చెప్పేది ఒకటే. ఆమె తన కూతురు సినిమాల్లోకి రావడం చూసి మురిసిపోతున్నారు. అలాగే శ్రీరెడ్డి తల్లిదండ్రులు కానీ, రేపు రాబోయే ఇతర హీరోయిన్ల తల్లిదండ్రులు కోరుకోరా? మాకు ఎందుకు కార్డులు రాకుండా చేస్తున్నారు. మా లాంటి వారి జీవితాలు సినిమా రంగంలో ఎదగకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

దొరసాని సినిమా హిట్టవ్వాలి

దొరసాని సినిమా హిట్టవ్వాలి

నేను ‘దొరసాని' సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగులో మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు అమ్మాయిలు అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఏ ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని నాకు ఉండదు, అందరూ బావుండాలనేది నా అభిమతమని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

సమంత, త్రిష లాంటోళ్లు కూడా హెల్ప్ చేయరు... వ్యభిచారం చేయకుంటే ఏం చేస్తారు

సమంత, త్రిష లాంటోళ్లు కూడా హెల్ప్ చేయరు... వ్యభిచారం చేయకుంటే ఏం చేస్తారు

శ్రీరెడ్డి లాంటి ఆడపిల్ల బాధ నరేష్ గారు పట్టించుకోరు, జీవితగారు పట్టించుకోరు.. సినిమా వాళ్లు ఎవరూ పట్టించుకోరు. సమంత, త్రిష లాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు జీవితంలో ఎన్నో తట్టుకుని వస్తారు. పెద్ద స్టార్లు అయిన తర్వాత అదంతా మరిచిపోతారు. ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిలు కష్టపడుతుంటే వారికి అవకాశాలు ఇవ్వమని కూడా చెప్పారు. అవకాశాలు లేనివారు చివరకు పొట్టకూటి కోసం వ్యభిచారాలు చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి... అంటూ శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మా బాధ, మా నరకం ఎవరికి చెప్పుకోవాలి?

మా బాధ, మా నరకం ఎవరికి చెప్పుకోవాలి?

మేము ఎక్కడికైనా వెళితే పబ్లిసిటీ కోసం, బ్లాక్ మెయిల్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారా? అని అడుగుతుంటారు. కానీ నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు అని చెప్పాలని ఉంటుంది. చెప్పినా ఎవరూ పట్టించుకోరు. చాలా మంది నిందలు వేస్తారు. మా బాధ, మా నరకం ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులకు కూడా దూరమై దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా బ్రతుకుతున్నాం... అంటూ శ్రీరెడ్డి కంటతడి పెట్టారు.

నన్ను చివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం చేశారుb

నన్ను చివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం చేశారుb

నన్ను చివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసుకోకూడదు, మా అసోసియేషన్ కార్డు ఇవ్వకూడదు అనే పరిస్థితికి తెచ్చారు. హైదరాబాద్ నుంచి దూరం చేశారు. అప్పటి వరకు టీఆర్పీల కోసం నాకు మద్దతుగా ఉన్న న్యూస్ ఛానల్స్ సడెన్‌గా శ్రీరెడ్డి గురించి నెగెటివ్ గా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు

నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు

నేను సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే పనికిరాని సమాజం. ఎవరు ఏది చెబితే అదే నమ్ముతుంది. దానికంటూ ఒక ఉద్దేశ్యం ఉండదు. ఎవరైనా ఐ వాంట్ టు మారీ శ్రీరెడ్డి అంటే... శ్రీరెడ్డినా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? అంటూ వారిని టార్చర్ పెడతారు... నా పరిస్థితి అలా అయిందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

మా తల్లిదండ్రుల్లా వెలివేయనందుకు మీకు థాంక్స్

మా తల్లిదండ్రుల్లా వెలివేయనందుకు మీకు థాంక్స్

దయచేసి నా మీద ఉన్న ఉద్దేశ్యం మార్చుకోండి. మార్చుకోకపోయినా నేను వచ్చి చేసేది ఏమీ లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాను. డిప్రెషన్లకి వెళ్లకుండా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. నా పేరు చెబితేనే దూరంగా జరిగిపోతున్న సమాజంలో నువ్వు ఏ తప్పూ చేయలేదురా అని కొంత మంది అక్కున చేసుకున్నారు. వారికి థాంక్స్. మా తల్లిదండ్రుల్లా నన్ను ఇంకా వెలేయకుండా నన్ను అర్థం చేసుకున్నందుకు వారికి రుణపడి ఉంటాను అని శ్రీరెడ్డి తెలిపారు.

English summary
Sri Reddy video about Jeevitha, Samantha, Trisha, Dorasani movie. Sri Reddy Mallidi, professionally known as Sri Reddy, is an Indian actress who is well known in the Telugu film and television industry. She made her debut in 2011 with Neenu Naana Abaddam, and also appeared in Aravind 2 and Zindagi
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more