సుస్మితా సేన్ సరికొత్త అఫైర్.. లలిత్ మోడీతో డేటింగ్.. ఫోటోలు వైరల్
ప్రపంచ సుందరి సుస్మితా సేన్, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ తమ అభిమానులకు, సన్నిహితులకు షాక్ ఇచ్చారు. సుస్మితసేన్‌తో తాను డేటింగ్ చేస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో లలిత్ మోడీ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం అంటే.. జూలై 15వ తేదీన సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. జీవితానికి కొత్త ప్రారంభం అంటూ కామెంట్ పెట్టారు.

లలిత్ మోడీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి.. ఇప్పడే లండన్‌కు వచ్చాను. మాల్దీవ్స్, సర్దానియా లాంటి ప్రదేశాలను సుస్మితా సేన్‌తో కలిసి గ్లోబల్ టూర్‌గా చుట్టు ముట్టి వచ్చాం. చివరకు నా లైఫ్‌లో కొత్త బిగినింగ్. చంద్రుడిపైకి ఎగిరినంత ఆనందంగా ఉంది అని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇస్తున్నాను. జస్ట్ డేటింగ్ చేస్తున్నాను. పెళ్లి కూడా ఏదో ఒకరోజు జరగడం ఖాయం అని లలిత్ మోడీ తన ట్వీట్‌పేర్కొన్నాడు.
లలిత్ మోడీ తన ట్వీట్‌తోపాటు ఫోటోలను షేర్ చేశారు. లండన్ పర్యటనలో అతి సన్నిహితంగా ఉన్న వారిద్దరి ఫోటోలను బాహ్య ప్రపంచానికి షేర్ చేశారు. వీరిద్దరి డేటింగ్ వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నా బెటర్ హాఫ్, పార్ట్‌నర్ అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











