twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆక్సిజన్‌ పంపిస్తానన్న సుస్మితకి నెటిజన్‌ సెటైర్‌.. ఘాటు కౌంటర్ ఇచ్చిన నటి !

    |

    కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. గత ఏడాది కరోనా కేసులు నమోదయిన మొదట్లో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితి అంత కన్నా దారుణంగా తయారయింది. ఈరోజు గడచిన 24 గంటల్లో 330000 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పుడు మరో అంశం కూడా ప్రభుత్వాలను, ప్రజలను టెన్షన్ పెడుతోంది. అదే ఆక్సిజన్ కొరత. కొంతమంది కరోనా పేషెంట్ లకు కృత్రిమంగా శ్వాస అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో చాలా చోట్ల ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. పరిస్థితి చేయిదాటితే ఏమీ చేయలేమనే భావనతో ఎప్పటికప్పుడు ఆస్పత్రులు ప్రభుత్వాన్ని ఆక్సిజన్ అందించమని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని శాంతి ముకుందా ఆసుపత్రి కూడా తమ హాస్పిటల్లో ఆక్సిజన్ అయిపోవచ్చింది అంటూ ఒక ప్రకటన చేసింది.

    ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత విపరీతంగా ఉందని పేర్కొంటూ ఇటీవల సీఈవో సునీల్‌ సాగర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ ఆస్పత్రికి ఆక్సిజన్ అందించడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ప్రకటించారు. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉందని కానీ ఢిల్లీలో శాంతి ముఖం ఆసుపత్రికి తాను కొన్ని సిలిండర్లను అందించగలనని చెప్పుకొచ్చింది. అయితే వాటిని ముంబై నుంచి ఢిల్లీకి ఎలా పంపించాలో అర్థం కావడం లేదు దయచేసి వాటిని రవాణా చేయడంలో నాకు ఎవరైనా సహాయం చేయండి అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

    Sushmita Sen strong counter to a netizen criticised her for sending oxygen cylinders

    అయితే సాయం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే పోయి ఒక నెటిజన్ ఆమె మీద సెటైర్ వేశారు. ఆక్సిజన్ కొరత అన్నిచోట్లా ఉన్న సమయంలో ముంబైలో మీరు సహాయం చేయకుండా ఢిల్లీలో వారికి ఎందుకు సాయం చేస్తున్నారు అంటూ కౌంటర్ వేసాడు. దీనికి స్మిత నేను కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. తనకు తెలిసినంత వరకు ముంబైలో ఆక్సిజన్ కొరతతో పెద్దగా లేదని కానీ ఢిల్లీలో ఉన్న ఆసుపత్రుల్లో చాలా అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. పెద్దాస్పత్రులు ఎలాగోలా ఆక్సిజన్ను సమకూర్చుకోగలుగుతాయని చిన్న ఆస్పత్రులు ఆక్సిజన్ సమకూర్చుకోవడానికి ఇబ్బందులు పడుతుందని ఆమె పేర్కొన్నారు. ఆమె మీరు సాయం చేయగలిగితే చిన్న ఆసుపత్రులకు చేయండి అంటూ అంటూ కామెంట్ చేసింది.

    English summary
    As the covid situation turning bad celebs have started being in the forefront to extend their moral and financial support to governemnt as well as individuals. Sushmita Sen recently took an initiative to send few oxygen cylinders for hospitals in Delhi facing shortage. But a Twitter user criticised her for sending them to Delhi instead of providing it to Mumbai hospitals. she strolongly replied to his comment over sending to delhi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X