Just In
- 36 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తాప్సీని ఆ హీరోతో పోల్చిన ప్రముఖ నిర్మాత.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నెటిజన్లు ఫిదా.
తాప్సీ పన్ను.. రాఘవేంద్రరావు - మంచు మనోజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఝుమ్మందినాదం' అనే సినిమాతో కెరీర్‌ను ఆరంభించిన ఈ చిన్నది.. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించినా సరైన హిట్ మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మాత్రం తాప్సీ అద్భుతమైన నటనతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీ అయిపోయింది. తాజాగా ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలో ఓ నిర్మాత తాప్సీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దీనికి ఆమె కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

ఇక్కడ గ్లామర్.. ఆక్కడ యాక్టింగ్
తెలుగులో గ్లామరస్ పాత్రలు మాత్రమే చేసింది తాప్సీ. కానీ, బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ సక్సెస్ అవుతోంది. తొలి హిందీ సినిమాతో హిట్ అందుకున్న తాప్సీ.. ఆ తర్వాత ‘పింక్'లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. వీటితో పాటు ఎన్నో మంచి పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది.

బోల్డ్ స్టేట్‌మెంట్లు.. తలెత్తిన వివాదాలు
తాప్సీ బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వ్యవహార శైలిలో సైతం మార్పులను చూపిస్తోంది. తరచూ ఏదో ఒక సామాజిక అంశంపై స్పందిస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఇందులో భాగంగానే ‘కబీర్ సింగ్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విమర్శనాస్త్రాలు సంధించింది. అంతేకాదు, అప్పుడప్పుడూ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఇరుక్కుపోతోన్న విషయం తెలిసిందే.
|
అత్యుత్తమ నటన.. అవార్డుల పంట
బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత తాప్సీ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. వరుస విజయాలతో పాటు ఆమె నటనకు అవార్డులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ‘పింక్' సినిమా ఆమె కనబరిచిన అభినయానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే, ‘నామ్ షాబానా', ‘మల్క్', ‘గేమ్ ఓవర్', ‘సాంధ్ కి ఆంఖ్' చిత్రాలకు గానూ ఆమె ఉత్తమ నటి పురష్కరాన్ని అందుకుంది.
|
తాప్సీని ఆ హీరోతో పోల్చిన ప్రముఖ నిర్మాత
ఇటీవల ప్రకటించిన 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020లో తాప్సీ ‘సాంధ్ కి ఆంఖ్' చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డ్ అందుకుంది. దీంతో ప్రముఖ నిర్మాత తనూజ్ గార్గ్.. తాప్సీని ఉద్దేశిస్తూ... ట్విట్టర్ వేదికగా ‘పవర్ హౌస్ అయిన తాప్సీకి కంగ్రాట్స్. మా బాలీవుడ్‌కు నువ్వు ఆడ ఆయుష్మాన్ ఖురానావు' అని కామెంట్ చేశారు.


అదిరిపోయే రిప్లై ఇచ్చిన స్టార్ హీరోయిన్
తనను హీరోతో పోల్చడం నచ్చకపోవడంతో తనూజ్‌కు తాప్సీ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ‘బాలీవుడ్‌కు మొదటి తాప్సీ పన్ను అని పిలవడం గురించి మీరు ఏమంటారు' అని ఆమె ప్రశ్నించింది. దీంతో నెటిజన్లు అందరూ ‘సరైన సమాధానం చెప్పావు. అయినా నిన్ను నిన్నులా కాకుండా హీరోతో పోల్చడం ఏంటి' అంటూ ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.