మరో ఐటెమ్ సాంగ్ దక్కించుకున్న తమన్నా.. భారీగా రెమ్యునరేషన్!
ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ ను స్పెషల్ సాంగ్స్ అనేవారు. ఇక ఆ పాటల్లో కనిపించే బ్యూటీలు రెగ్యులర్ హీరోయిన్స్ కంటే చాలా స్పెషల్ గా ఉండేవారు. కానీ కాలం మారుతున్న తరుణంలో ఐటమ్ సాంగ్స్ బ్రాండ్ బాగానే పెరిగిపోయింది. ఇక హీరోయిన్స్ కూడా అలాంటి వాటికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. టాప్ స్టార్ హీరోయిన్స్ సైతం బడా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తూ హాట్ స్టెప్పులతో షాక్ ఇస్తున్నారు.
ఇక తమన్నా భాటియా కూడా అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్ తో అభిమానులకు సరికొత్త కిక్కిస్తోంది. అల్లుడు శీను టైమ్ లోనే అమ్మడు కోటి వరకు డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ తరువాత జై లవ కుశ - సరిలేరు నీకెవ్వరు వంటి సాంగ్స్ తో కూడా మంచి క్రేజ్ అందుకోంది. ఇక చాలా రోజుల అనంతరం మిల్కి బ్యూటీకి మరో మంచి ఆఫర్ దక్కినట్లు టాక్ వస్తోంది. వరుణ్ తేజ్ గని సినిమాలో కూడా ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

గని సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ ప్రీ క్లయిమ్యాక్స్ లో వచ్చే మాస్ ఐటెమ్ సాంగ్ అద్భుతంగా ఉంటుందట. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక మిల్కీ బ్యూటీ గ్లామర్ కు తగ్గట్లుగానే ఆ సాంగ్ ను హాట్ గా కంపోజ్ చేస్తారట. మరి సినిమాకు ఆమె అందం ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ఈ సాంగ్ కు కూడా తమన్నా కోటికి పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. గని సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా అల్లు బాబీ తన న్యూ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











