పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకున్నా ... నా జీవితం ఇలా ... తమన్నా ఎమోషనల్
సహజంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మూడు నాలుగేళ్లుంటే అదే గొప్ప.. అలాంటిది దాదాపు 20 ఏళ్లుగా హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే పేరు తమన్నాది. 35 ఏళ్లు క్రాస్ చేసిన ఈ బ్యూటీ అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి పెళ్లయి గుడ్ న్యూస్ చెప్పేది. కానీ అనూహ్యంగా ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది.
ఇండియాలో టాప్ హీరోయిన్‌లలో ఒకరు
15 ఏళ్ల చిన్న వయసులోనే హీరోయిన్‌గా అడుగుపెట్టారు తమన్నా భాటియా... శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్‌తో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఛాన్స్‌లు అందుకుని దక్షిణాదిని ఒక ఊపారు తమన్నా. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం నెంబర్ల ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకుని స్పెషల్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కుర్రకారును ఊపేశాయి.

ఐటెం సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా
ప్రస్తుతం ఓ రోమియో, రేంజర్, రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా, వీ వ్యాన్ సినిమాలలో తమన్నా భాటియా నటిస్తున్నారు. ఇవన్నీ హిందీ సినిమాలే కావడం గమనార్హం. తెలుగులో ఓదెల 2లో చివరిసారిగా నటించిన తమన్నా భాటియా.. ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. లేదా దర్శక నిర్మాతలే ఆమెను పట్టించుకోవడం లేదని అంటున్నారు. స్పెషల్ సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన తమన్నాకు మరిన్ని ఆఫర్లు వస్తాయని భావిస్తున్నారు.
విజయ్ వర్మతో బ్రేకప్
ఇకపోతే.. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో తనతో కలిసి నటించిన విజయ్ వర్మతో తమన్నా భాటియా ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు వీరిద్దరూ డేటింగ్ చేసి.. ఇక రేపో మాపో పెళ్లి అనగా ఈ జంట విడిపోయింది. ఈ జంట మధ్య బ్రేకప్ జరగడానికి కారణాలు ఏంటీ? అనేది మాత్రం తెలియరాలేదు. మీడియాలో మాత్రం రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. కెరీర్‌పై దృష్టి పెట్టాలని విజయ్ వర్మ భావించగా.. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని తమన్నా గట్టిగా నిర్ణయించుకోవడం వల్లే వీరి మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు ఎవరిదారులు వారివి అయ్యాయి. అయితే తమన్నా ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మరోసారి పెళ్లిపై హాట్ కామెంట్స్ చేశారు.
పిల్లలను కనాలని అనుకున్నా
30 ఏళ్లు దాటిన హీరోయిన్లను ఇండస్ట్రీ చూసే విధానం మారిపోయింది. ఇలాంటి వారి కోసం బలమైన పాత్రలు రాస్తున్నారని.. గతంలో ఇలా ఉండేది కాదని తమన్నా అన్నారు. తాను కెరీర్ ప్రారంభించిన కొత్తలో 30 ఏళ్ల వయసు వచ్చే వరకు పనిచేయాలని, ఆ తర్వాత కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకుని పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్నానని తమన్నా భాటియా తెలిపారు. అలాగే వయసు పెరుగుతుండటంపై నాకు ఎలాంటి భయం లేదని.. వృద్ధాప్యం చాలా అద్భుతమైనదని తమన్నా అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిని బట్టి చూస్తే విజయ్ వర్మతో పెళ్లి కనుక జరిగి ఉంటే .. మిల్కీ బ్యూటీ ఖచ్చితంగా కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేవారని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











