Don't Miss!
- News
Viral Video: బెల్ట్ తో కొట్టుకుంటూ బర్త్ డే సెలబ్రెషన్స్.. అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. వీడియో వైరల్..
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Finance
పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా..?
- Automobiles
హోండా ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ Honda CB300F
- Sports
Chess Olympiad 2022 ముగింపు వేడుకలకు ధోనీ.. టాప్‌లో హంపీ టీమ్
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Tamannah Bhatia పాకిస్థాన్ క్రికెటర్‌తో పెళ్లి.. మిల్కీ బ్యూటీ ఏమని క్లారిటీ ఇచ్చిదంటే?
సినీ పరిశ్రమలో హీరోయిన్ల అఫైర్లు, డేటింగ్, ప్రేమ, పెళ్లికి సంబంధించిన రూమర్లు రావడం చాలా సాధారణం. అందుకు తమన్నా భాటియా మినహాయింపు కాదేమో. అయితే ఎప్పటి మాదిరిగానే తమన్నా భాటియా పెళ్లి గురించి జాతీయ మీడియాలో ఇటీవల కాలంలో ఎక్కువగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తన పెళ్లి గురించిన వార్తలపై తమన్నా భాటియా మీడియాకు స్పష్టం చేశారు. మిల్కీ బ్యూటీ చెప్పిన విషయం ఏమింటంటే..

వెబ్ సిరీస్‌లతో బిజీగా
గతేడాది తమన్నా వెబ్ సిరీస్‌లతో ఆలరించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన 11th Hour, అలాగే నవంబర్ స్టోరి వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నారు. అగ్ర హీరోలతో జతకడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను కొనసాగిస్తున్నారు.

వెంకటేష్, చిరంజీవితో సినిమాలు
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. హిందీ మూవీ ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రంలోను కన్నడలోను రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే వెంకటేష్‌తో F3, మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్‌తోపాటు సత్యదేవ్‌తో గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించేందుకు సిద్దమవుతున్నారు.

పాకిస్థాన్ క్రికెటర్‌తో పెళ్లి అంటూ
గతేడాది తమన్నా భాటియా పెళ్లి చేసుకోబోతున్నదనే వార్త జాతీయ మీడియాలో హల్‌చల్ చేసింది. కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను తమన్నా వివాహం చేసుకోబోతున్నదనే వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ వార్తలను ఆమె ఖండించడంతో ఆ రూమర్లకు తెరపడ్డాయి.

పెళ్లి వార్తలను ఖండిస్తూ..
అయితే పెళ్లి వార్తలను ఖండించిన తమన్నా పాకిస్థాన్ క్రికెటర్‌తో డేటింగ్ వ్యవహారంపై నోరు మెదపలేదు. డేటింగ్ చేస్తున్నాననే విషయంపై మాట్లాడానికి నిరాకరించారు. ఇంతకు అబ్దుల్ రజాక్‌తో అఫైర్ ఉందా లేదా అనే విషయం ప్రశ్నగానే మిగిలిపోయింది.

పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు..
అయితే తాజాగా మళ్లీ తమన్నా పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. తన పెళ్లి వార్తలపై మరోసారి క్లారిటీ ఇస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి చేసుకొనే మూడ్ లేదు. ప్రస్తుతం నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నాను. మీడియాలో వస్తున్న పెళ్లి వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ అభూత కల్పనలే. ఆ రూమర్లను నమ్మవద్దు. వాటిని గాసిప్‌గానే గుర్తించండి అంటూ తమన్నా స్పష్టం చేసింది.