Actress Hema: 'నేను సుద్దపుసను కాదు.. నా జోలికి వస్తే మాత్రం.. '
Actress Hema: టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి హేమ. 250కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి-వెంకటేష్ నటించిన క్షణ క్షణం చిత్రంతో తెరంగేట్రం చేసిన హేమ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో చేసిన సన్నివేశాలు నేటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి. అయితే, సినిమాలతో పాటు హేమ తరచూ వివాదాల కారణంగా కూడా మీడియాలో హైలైట్ అవుతుంటారు. ముఖ్యంగా మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రెస్ మీట్స్ ఒక్కసారి కాదు, పలుమార్లు హాట్ టాపిక్ అయ్యాయి.
అంతేకాకుండా సహనటులపై చేసిన సూటి, తూటి కామెంట్స్‌తో అప్పట్లో హేమ హంగామా సృష్టించారు. గతేడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసుతో హేమ పేరు మళ్లీ పెద్ద వివాదానికి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా మారింది. ఆ పార్టీలో పాల్గొని డ్రగ్స్ వాడిందని వచ్చిన ఆరోపణలతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులపాటు రిమాండ్‌లో ఉన్న హేమ, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు రక్తపరీక్షల రిపోర్టులు పబ్లిక్‌గా విడుదల చేసి, "నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు" అని స్పష్టం చేశారు.

ఇటీవల నటి హేమ మళ్లీ వార్తల్లో నిలిచారు. తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబ్ ఛానెళ్లకు లీగల్ నోటీసులు పంపించారు. ఇందులో కరాటే కల్యాణి, బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి, అలాగే పలు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఈ అంశం తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. "గతంలో నేను ఓ సమస్యలో ఉన్నప్పుడు, వీరందరూ నా మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత జీవితంపై తప్పుడు ఆరోపణలు చేశారు. అబద్ధాలతో నా పరువుకు నష్టం కలిగించారు. అందుకే ఈసారి మాటల్లో కాకుండా చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నాను. ఇకపై ఎవ్వరూ సినీ కళాకారుల గురించి నిరాధారమైన కామెంట్స్ చేయకూడదు. నాకు జరిగిన నష్టం మరెవరికీ జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ చర్య తీసుకున్నాను," అని స్పష్టం చేశారు.
ఈ అంశం తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నేను సుద్దపూసను కాదు.. నేను ఎవరి జోలికి వెళ్లను, నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. నా జీవితం నా ఇష్టం. నేను చిన్న పిల్లను కాదు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు.. దయచేసి అర్థం చేసుకోండి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హేమ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. సినిమాల్లో హాస్యపాత్రలతో నవ్వులు పంచే హేమ, రియల్ లైఫ్‌లో మాత్రం తన నేరుగా మాట్లాడే నైజం వల్ల తరచుగా హైలైట్ అవుతుంటుంది. గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్టయి, కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఆ కేసు నుంచే తనపై తప్పుడు ప్రచారం మొదలైందని, అందుకే ఇప్పుడు తన వైఖరిని స్పష్టంగా చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











