నన్ను చేసుకోవాలంటే ఎంత సంపాదించాలంటే.. పెళ్లికి రాశీఖన్నా షాకింగ్ కండీషన్
ఉత్తరాది నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కి వెళ్లారు రాశీ ఖన్నా. అందం, చలాకీతనం, నటనలో ఏమాత్రం తీసిపోని క్వాలిటీలు ఈమెలో ఉన్నారు. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్‌ను పక్కనపెట్టిన రాశీ ఖన్నా.. ఇటీవల సిద్ధూ జొన్నలగడ్డతో సరసన తెలుసు కదా సినిమాతో మరోసారి పలకరించారు. 35 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇటీవల తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాల్సిందో బయటపెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
12 ఏళ్ల జర్నీ
ఢిల్లీకి చెందిన రాశీ ఖన్నా.. స్థానిక లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. చదువులో తొలి నుంచి టాపర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఐఏఎస్ కావాలని ఎన్నో కలలు కన్నారు. ఇందుకోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యారు కడా. అయితే విధి ఆమెను సినీరంగం వైపు నడిపించింది. దీనిలో భాగంగా తొలుత మోడలింగ్‌లోకి దిగిన రాశీ ఖన్నాకు ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. తొలుత హిందీలో 2013లో మద్రాస్ కేఫ్ అనే సినిమాలో నటించారు రాశీ ఖన్నా. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహాలు గుసగుసలాడే చిత్రంతో తెలుగువారిని పలకరించారు రాశీ.

సౌత్‌లో హీరోయిన్‌గా హవా
ఆ తర్వాత జిల్, మనం, జోరు, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్, జై లవ కుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలి ప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, ప్రతీరోజూ పండగే, పక్కా కమర్షియల్ , థాంక్యూ వంటి సినిమాల్లో రాశీ ఖన్నా నటించారు. టాలీవుడ్‌తో పాటు తమిళ్, మలయాళం, హిందీ మూవీల్లోనూ ఆమె నటించారు. ప్రస్తుతం టీఎంఈ, అఘాతీయ అనే సినిమాల్లోనూ రాశీ నటిస్తున్నారు. ఈ దశలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో అనూహ్యంగా అవకాశం దక్కించుకున్నారు రాశీ. తెలుగు భాషను ఎంతో ఇష్టపడే రాశీ ఖన్నా.. ఉత్తరాది అమ్మాయే అయినా తెలుగును కష్టపడి నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడంతో పాటు పాటలు పాడే స్థాయికి చేరింది.
తెలుసు కదాతో తెలుగులో హల్‌చల్
కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం తెలుసు కదా. నీరజ కోన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా... రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష, రవి మరియా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వీఎస్ జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
డబ్బు కావాల్సిందే
తెలుసు కదా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీనిధి శెట్టితో కలిసి రాశీఖన్నా సందడి చేశారు. ఈ క్రమంలోనే మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఎలాంటి క్వాలిటీలు ఉండాలి అనే దాని గురించి యాంకర్ శ్రీముఖి ప్రశ్నించింది. దీనికి ఇద్దరు హీరోయిన్లు బోర్డుపై రాసి చూపించారు. ఈ క్రమంలో రాశీ ఆన్సర్స్ వైరల్ అయ్యాయి. కాబోయే భర్తకు 35 నుంచి 38 ఏళ్లు ఉండాలని, అలాగే హైట్ 5 అడుగుల 9 అంగుళాల నుంచి 6 అడుగుల 3 అంగుళాల మధ్య ఉండలని తెలిపింది. బరువు 85 కేజీలు ఉండాలని, ఆస్తులు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. యాక్టర్ కానీ, డాక్టర్ కానీ అయితే బెటర్ అని పేర్కొంది. ఇక అన్నింటిలోకి అతనికి ఏడాదికి కోటి రూపాయల శాలరీ రావాలని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











