ఆశ్చర్యం: ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ధర ఎంతో తెలుసా?

By Bojja Kumar

Recommended Video

మనీష్ మల్హోత్రా పార్టీ లో ఎంగేజ్మెంట్ రింగుతో కనిపించిన ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కొన్నిరోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన ప్రియాంక చోప్రా చేతికి ఎంగేజ్మెంట్ రింగుతో కనిపించింది. ఈ పార్టీకి వచ్చిన గెస్టులతో ఆమె తన ఎంగేజ్మెంట్ విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో కరిష్మా కపూర్, రవీనా టండన్, నేహా ధూపియా, సోఫీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

గత నెలలో ప్రపోజ్ చేశాడు

గత నెలలో ప్రపోజ్ చేశాడు

ప్రియాంక చోప్రా వయసు 36 సంవత్సరాలు. హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ఆమెకు 25 ఏళ్ల వయసున్న అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. గత నెల ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా లండన్లో నిక్ ఆమెకు ప్రపోజ్ చేశాడట.

 రూ. కోటి విలువైన రింగ్

రూ. కోటి విలువైన రింగ్

గత నెలలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ సందర్భంగా నిక్ ఆమెకు 2 లక్షల డాలర్లు (రూ. కోటి) విలువ చేసే ఉంగరం వేలికి తొడిగాడట. 4 క్యారెట్ల వజ్రంతో తయారు చేసిన ఆ డైమండ్ టిఫానీ అండ్ కో అనే జ్యువెలరీ షాపు నుండి కొనుగోలు చేశాడట. ఈ ఉంగరం కొనుగోలు చేయడానికి షాపు మొత్తాన్ని మూయించి తీరిక కూర్చుని తనకు కావాల్సిన రింగ్ సెలక్ట్ చేసుకున్నాడట నిక్.

 భారత్ వస్తున్న నిక్ కుటుంబం

భారత్ వస్తున్న నిక్ కుటుంబం

ఆగస్టు 18న నిక్ కుటుంబం ఇండియా వస్తున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో విడిది ఏర్పాటు చేశారట. ఈ సందర్భంగా ప్రియాంక తన పెళ్లి ప్రకటన చేయబోతోందని, ఈ సందర్భంగా ప్రియాంక గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నట్లు టాక్.

కరణ్ జోహార్‌తో కలిసి ప్రియాంక

కరణ్ జోహార్‌తో కలిసి ప్రియాంక

మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన పార్టీలో కరణ్ జోహార్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ప్రియాంక చోప్రా. ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

 పార్టీలో ఇతర స్టార్లు

పార్టీలో ఇతర స్టార్లు

ఈ పార్టీలో ప్రియాంక చోప్రాతో పాటు రవీనా టండన్, కరిష్మా కపూర్, సోఫీ చౌదరి, నేహా ధూపియా తదితరులు పాల్గొన్నారు.

యంగ్ జనరేషన్

యంగ్ జనరేషన్

మనీష్ మల్హోత్రా పార్టీలో యంగ్ జనరేషన్ బాలీవుడ్ స్టార్స్ జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్, అన్షులా కపూర్, అనన్య పాండే, షనయా కపూర్ తదితరులు కూడా ఉన్నారు.

సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X