Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RRR మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీళ్లే: ప్రెగ్నెన్సీ వల్ల ఒకరు.. ఆ రోల్ నచ్చక మరొకరు ఔట్
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించి.. భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దీనికి కారణం ఈ చిత్రాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించడంతో పాటు ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడమే. ఫలితంగా ఈ మూవీ ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇక, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు స్పందన తారాస్థాయిలో దక్కుతోంది. దీంతో తక్కువ సమయంలోనే కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమాను ఎంత మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా RRR మూవీ
టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు. ఇక, ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదలైంది.
బట్టలున్నా లేనట్లే షాకిచ్చిన శృతి హాసన్: ప్రైవేట్ భాగాలు మొత్తం కనిపించేలా ఘోరంగా!

ఇద్దరు హీరోయిన్లు.. రోల్స్ ఇవే
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. రామ్ చరణ్‌కు జోడీగా సీత అనే పాత్రను పోషించింది. అలాగే, లండన్ భామ ఒలీవియా మోరిస్.. ఎన్టీఆర్ సరసన జెన్నీ అనే బ్రిటీష్ అమ్మాయిగా చేసింది. వీళ్లిద్దరూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

ఆమె పాత్ర ఇంతే.. ఈమె చాలా
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో హీరోయిన్ల పాత్రల గురించి చాలా రకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రోల్ చాలా తక్కువగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ, ఒలీవియా మోరిస్ పాత్రకు ప్రాధాన్యం ఉందని.. ఆమె క్యూట్‌నెస్ కూడా అదిరిపోయిందని అంటున్నారు.
Samantha: ఇన్‌స్టాగ్రామ్‌తో సమంత లక్షల సంపాదన.. ఒక్క పోస్టుకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే!

RRR మూవీని రిజెక్ట్ చేసేశారు
సాధారణంగా దర్శకధీరుడు రాజమౌళితో ఒక్క సినిమాలోనైనా నటించాలని చాలా మంది నటీనటులు కలలు కంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన రేంజ్ మరింతగా పెరగడంతో బాలీవుడ్ వాళ్లు సైతం ఇదే భావనతో ఉన్నారు. కానీ, RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని మాత్రం ఏకంగా నలుగురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారట. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

ఆలియా కంటే ముందు ఇద్దరు
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఆలియా భట్ పోషించిన సీత పాత్ర కోసం రాజమౌళి చాలా వర్క్ చేశాడు. ఇందులో భాగంగానే ఈ రోల్ కోసం ‘సాహో' బ్యూటీ శ్రద్దా కపూర్‌ను ఆయన ముందుగా సంప్రదించాడు. కానీ, డేట్స్ ఖాళీ లేని కారణంగా ఆమె దీనికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇదే పాత్రకు పరిణితీ చోప్రాను కూడా సంప్రదించగా.. ఆమె సేమ్ రీజన్‌తో రిజెక్ట్ చేసేసింది.
అందాల ఆరబోతతో షాకిచ్చిన ఈషా రెబ్బా: తెలుగు పిల్లను ఇలా చూస్తూ తట్టుకోలేరు!

ఒలీవియా పాత్ర కోసం ఇద్దరు
పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన చిత్రం కావడంతో RRR (రౌద్రం రణం రుధిరం)లో బ్రిటీష్ యువతి పాత్ర కోసం కూడా రాజమౌళి చాలా అన్వేషణ చేశాడు. ముందుగా ఈ పాత్ర కోసం ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్‌ను సంప్రదించాడు. కానీ, అప్పుడామె ప్రెగ్నెంట్ కావడంతో రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత డైసీ ఎడ్గార్ జోన్స్ తీసుకున్నారు. కానీ, ఆమె ఎందుకనో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది.
Recommended Video


RRR మూవీ టోటల్ కలెక్షన్లు
ఏపీ తెలంగాణలో RRR మూవీ 6 రోజుల్లోనే రూ. 180.17 కోట్లు రాబట్టింది. అలాగే, కర్నాటకలో రూ. 26.15 కోట్లు, తమిళనాడులో రూ. 23.55 కోట్లు, కేరళలో రూ. 5.35 కోట్లు, హిందీలో రూ. 60.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 71.20 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లోనే రూ. 371.37 కోట్లు షేర్, రూ. 670 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.