‘ముద్దులన్నీ స్కూల్ డేస్‌లోనే ఫినిష్.. ఇప్పుడు అయితే డైరెక్ట్ ఎటాక్’ హీరోయిన్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సురేఖా వాణి కూతురు సుప్రితా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సురేఖ వాణి తన చిత్రాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఆయా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే వస్తోంది. మరోవైపు తన కూతురు సుప్రితాను హీరోయిన్ గా నిలబెట్టెందుకు ఎంతో ప్రయత్నిస్తోంది.తల్లికూతుళ్లు కలిసి సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ ఉన్నారు. తమ గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వచ్చారు.
ఇక సోషల్ మీడియాలో తరుచూగా కనిపిస్తూనే ఉంటారు. తల్లితోనే సురేఖ వాణి ఎప్పుడూ కనిపిస్తుంది. ఇద్దరు కలిసి టూర్లు, వెకేషన్లకు వెళ్తూ సందడి చేస్తూ ఉంటారు. తమ లేటెస్ట్, స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇక సుప్రితా మరోవైపు హీరోయిన్ గా అలరించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. నటిగా తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి అలరించింది. టాక్ షోకు కూడా యాంకర్ గా వ్యవహరించింది.

సుప్రితా తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల క్రేజీ యాంకర్ నిఖిల్ తో చిట్ చాట్ కు హాజరైంది. ఇదే షోకు యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్ వీరిద్దరిని ఊహించని విధమైన ప్రశ్నను అడిగారు. మీరు ఇద్దరు కలిసి సినిమా తీశారు కదా, కిస్సింగ్ విషయంలో ఏమైనా ప్రాక్టీస్ చేశారా? అంటూ షాకింగ్ ప్రశ్న అడిగారు. అందుకు వారిద్దరూ ఆశ్చర్యపోయారు.
ముందుగా అమర్ దీప్ స్పందిస్తూ అసలు కిస్సింగ్ కు ప్రాక్టీస్ ఏంట్రా అని ప్రశ్నించాడు. అది కూడా ప్రాక్టీస్ ఉంటుందా? ఈ సినిమాలో సన్నివేశం ఉంటే మాత్రం కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని అమర్ దీప్ చెప్పారు. అదే ఆ ప్రిపరేషన్ జరిగిందా అని మళ్లీ నిఖిల్ ప్రశ్నిస్తాడు. దాంతో అమర్ దీప్ అవును అని బదులిస్తాడు. ఎవరితో అని అడగ్గానే అప్పుడు ఎవరుంటే గర్ల్ ఫ్రెండ్ తో ప్రాక్టీస్ ఉంటుంది కదా అని నవ్వుతూ బదులిస్తాడు.
ఇక సుప్రితా కూడా ఇదే ప్రశ్నకు ఆస్తికరంగా బదులిచ్చింది. కిస్సింగ్ ప్రాక్టీస్ అంటూ ఏమీ లేదు. అస్సలు దానికి కూడా ప్రాక్టీస్ చేస్తారా అని అనింది. ఎప్పుడూ చెప్పినట్టుగానే నా ఫస్ట్ కిస్ స్కూల్ డేస్ లోనే అయిపోయింది. ఈ విషయమైతే చాలా సార్లు చెప్పాను. ఇక ఇప్పుడైతే ముద్దులేవ్ డైరెక్ట్ ఎటాక్ హా అని నిఖిల్ సుప్రితాతో షాకింగ్ గా అంటాడు. ప్రస్తుతం వీరి కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అమర్ దీప్ చౌదరి, సుప్రితా కాంబినేషన్ లో చివరిగా చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి సినిమాలో కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











