నన్ను ముద్దు పెట్టుకుంటారా? సోషల్ మీడియాలో ఊర్వశి రటేలా పోస్ట్ రచ్చ
బాలీవుడ్‌తోపాటు తెలుగులో సత్తా చాటుకోవాలని చూస్తున్న బ్యూటీ ఊర్వశి రౌటేలా బోల్డ్, హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తున్నది. రకరకాల ఫ్యాషన్ దుస్తులతో ప్రేక్షకులను, నెటిజన్లు ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. కేవలం యాక్టింగ్‌పైనే కాకుండా ఊర్వశి సమాజసేవలో కూడా నిమగ్నమవుతున్నారు. తాజాగా ఊర్వశి రటేలా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో వైరల్‌గా మారింది. తాజాగా ఇండియాలోని అంతర్జాతీయ బ్రాండ్ డిజైన్ చేసిన దుస్తుల్లో ఊర్వశి రటేలా మెరిసింది.
బంగారం రంగులో ఉన్న గౌన్‌లో అందంగా కనిపిస్తూ నెటిజన్లు కవ్వించేలా ఉంది. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్ శివానీ అవస్తీ రూపొందించారు. తొడ భాగంలో చీలనట్టు ఉన్న గౌన్‌లో నుంచి ఆమె అందాలు కనిపించి.. కనిపించనట్టుగా నెటిజన్లు విశేషంగా ఆకర్షించాయి.

తాజాగా పోస్టు చేసిన ఫోటోలో మీలో ఎవరైనా మరింత ముద్దు పెట్టుకొంటారా? మనం చాలా యంగ్. ముద్దు పెట్టుకోవడం ఏమీ అయిపోదు అంటూ కొంటెగా కామెంట్ చేశారు. దాంతో నీవు అద్భుతంగా కనిపిస్తున్నావు. నీ లుక్ సూపర్‌గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే గుండే జారిపోయిందంటూ ఎమోజీలు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు. ఫోటోను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే సుమారు 8 లక్షల లైకులు పడ్డాయి.
సోషల్ మీడియాలో ఊర్వశి రటేలా విషయానికి వస్తే.. ఇన్స్‌టాగ్రామ్‌లో 38 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో కూడా భారీగా అభిమానగణం ఉంది. సోషల్ మీడియాలో అత్యధిక ప్రభావితమైన సెలెబ్రిటీగా ఆమె కొనసాగుతున్నారు.

ఊర్వశి రటేలా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో బ్లాక్ రోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళంలో ఓ భారీ ప్రాజెక్టు కోసం అంగీకారం తెలిపింది. అలాగే హిందీలో ఓ వెబ్ సిరీస్లో రణ్‌దీప్ హుడాతో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











